ఆత్మహత్య ల్లో అగ్రస్థానంలో మహారాష్ట్ర..తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది చేసుకున్నారంటే ?
దేశంలో ఆత్మహత్యలపై జాతీయ నేర గణాంక విభాగం గణాంకాల రిపోర్టును వెల్లడి చేసింది . 2019 సంవత్సరంలో గతేడాది కంటే ఎక్కువ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని తెలిపింది. సగటున రోజుకు 381 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది. 2019 ఏడాదిలో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2018లో 1,34,516 మంది ఉన్నారు. వీరిలో 70.2 శాతం మంది పురుషులు, 29.8 శాతం మంది మహిళలు ఉన్నారు. ఆత్మహత్య లు చేసుకునే వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారని తెలిపింది
18 వేలకు పైగా కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడులో 13 వేలు, పశ్చిమ బెంగాల్ 12 వేలతో రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 7,675 మంది చనిపోగా వీరిలో 2,858 మంది కూలీలనీ, 499 మంది రైతులు ఉన్నారని వెల్లడించింది. ఏపీలో 6,465 ఆత్మహత్యలు చేసుకోగా..వీరిలో వివాహం తర్వాత ఆత్మహత్యలు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారని తేలింది. ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 53.6 శాతం ఉరివేసుకోగా, 25.8 శాతం మంది విషం తాగి, మరో 3.8 శాతం మంది నిప్పంటించుకొని, 5.2 శాతం శాతం మంది నీళ్లలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా..ఇంకొందరు కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది, వివాహ సంబంధిత సమస్యల కారణంగా 5.4 శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, పుదుచ్చేరి, ఒడిశా, చండీగఢ్, మణిపూర్, ఢిల్లీలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకపోవడం విశేషం.