కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు అందరు సామాజిక దూరం - శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక దూరం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కలిగిన వ్యక్తులు తుమ్మినా - దగ్గినా - తుంపర్లు పడినా అవి శరీరంలోకి ప్రవేశిస్తే వారికి కూడా ఈ వైరస్ సోకుతుంది. కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. లేదంటే తుంపర్లు పడి వైరస్ సోకే ప్రమాదముందని చెబుతున్నారు.
అయితే కేవలం ఆరు అడుగులే కాదు 20 అడుగుల వరకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాంత బర్బర్ రీసెర్చ్‌లో తేలింది. కేవలం సోషల్ డిస్టెన్స్ సరిపోదని - కరోనా సోకిన వ్యక్తులకు కనీసం 20 అడుగుల దూరంలో ఉండాలని చెబుతున్నారు. అంతకుముందు జరిపిన పరిశోధనలో 40వేల శ్వాస సంబంధ తుంపర్లు - తుమ్ములు - దగ్గు సాధారణంగా మాట్లాడటం వల్ల సెకను సమయంలో మీటర్ల దూరం వెళ్తుందని తేలింది.
వాతావరణ పరిస్థితులు మారినట్లు వైరస్ వ్యాప్తి కూడా ఒకే దారిలో పయనిస్తుందని చెప్పలేమని కూడా అంటున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆరు అడుగుల దూరాన్ని సూచించింది. వాతావరణ పరిస్థితులు మారుతుంటే ఇది 6 మీటర్ల వరకు కూడా అంటే దాదాపు 20 అడుగుల దూరం ప్రయాణిస్తాయని చెబుతున్నారు.