కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొని లెఫ్టెనెంట్ హోదాలో సైన్యంలోకి అడుగుపెట్టారు నితికా కౌల్. ఆమె మాత్రమే కాదు.. చాలామంది సైన్యంలో చేరారు. కానీ.. ఆమెకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున పబ్లిష్ కావటమే కాదు.. ఆమె మాటకు యావత్ దేశం కదిలింది. ఆ మాటకు వస్తే.. ఆమె సెల్యూట్ భారతావనిని ఎమోషనల్ గా టచ్ చేసింది. ఎందుకు? అన్న విషయం తెలియాలంటే దాదాపు 27 నెలల వెనక్కి వెళ్లాలి. అప్పుడే మరింత బాగా అర్థమవుతుంది.
పుల్వామాలో జైషే మొహమ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలి కావటం తెలిసిందే. తీవ్రమైన ఆగ్రహాజ్వాలలు వెల్లువెత్తాయి. పోలీసు.. ఆర్మీ ప్రతీకారంతో రగిలిపోయారు. పుల్వామా దాడి తర్వాత.. సైనికుల వీర మరణానికి కారణమైన ప్రదేశానికి కేవలం పదిమేను కిలోమీటర్ల దూరంలో ఒక ఎన్ కౌంటర్ జరిగింది. అందులో జైషే మొహ్మమద్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైతే.. అందులో ఇద్దరు అగ్రనేతలు ఉన్నారు. అయితే.. సమయంలో ఈ ఉదంతంలో ఐదుగురు భద్రతా సిబ్బంది వీర మరణం పొందారు.
వీరిలో 55 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ ఉన్నారు. డెహ్రాడూన్ కు చెందిన ఆయనకు అంతకు 9 నెలల క్రితమే పెళ్లైంది. కశ్మీర్ కు చెందిన నితికా కౌల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరో మూడు నెలల్లో మొదటి వార్షికోత్సవాన్ని ఎలా జరుపుకోవాలన్న ప్లానింగ్ లో ఉన్న వారి జీవితంలో ఊహించని సంక్షోభం చోటు చేసుకుంది. చూడచక్కని జంటపై విధి చిన్నచూపు చూసింది.
అమరుడైన భర్తను చూసిన నితికా గుండె బద్ధలైంది. ఆమె వేదనను తీర్చే వారే లేకపోయారు. విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన మేజర్ విబూకు భారత ప్రభుత్వం శౌర్యచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. భర్త అంత్యక్రియల వేళ.. ఆమె పలికిన వీడ్కోలు అప్పట్లో అందరిని ఆకర్షించింది. గాలిలో ముద్దు ఇచ్చి.. లవ్ యూ విభూ అంటూ భర్త పార్థివదేహానికి ఆమె పలికి వీడ్కోలు వీడియో వైరల్ గా మారింది.
భర్త దూరమైన నితికా ధైర్యాన్ని కోల్పోలేదు. దేశ సేవలో నిమగ్నమై ఉండాలన్న భర్త ఆశయాన్ని కొనసాగించాలని డిసైడ్ అయ్యింది. భర్త మరణించే నాటికి నితికా ఒక ఎన్ ఎంసీ కంపెనీలో పని చేస్తుండేవారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పట్టుదలతో చదివి.. గత ఏడాది షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలో.. అనంతరం ఇంటర్వ్యూలో నెగ్గారు.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాదిగా జరిగిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. లెఫ్టినెంట్ హోదాలో శనివారం ఆమె సగర్వంగా అడుగు పెట్టారు. ఆ సందర్భంగా ఆమె చేసిన సెల్యూట్ కు భారతావని ఎమోషనల్ గా ఫీల్ అయ్యింది. సైన్యంలో చేరటం ద్వారా తన భర్తకు మరింత దగ్గరైనట్లుగా అనుభూతి చెందుతున్నట్లుగా నితికా చెప్పారు. సైన్యంలో చేరటం తన భర్తకు నిజమైన నివాళిగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. భర్త మరణించిన 15 రోజుల తర్వాత ఢిల్లీలో మళ్లీ ఉద్యోగంలో చేరానని.. బాధను మరిచిపోవటానికి కొంతకాలం పని చేసి.. రాజీనామా చేశానని చెప్పారు. షార్ట్ సర్వీసు కమిషన్ పరీక్ష రాసి.. సర్వీసులో చేరటం.. అందుకు అవకాశం లభించటం సంతోషంగా ఉందంటున్నారు.