హైదరాబాద్ మహానగరానికి సంబంధించి కొన్ని వాణిజ్య సంస్థల పుణ్యమా అని.. ఆయా ప్రాంతాలకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. ఇప్పుడు కాదు కానీ.. ఓ ఇరవైఏళ్ల క్రితం అబిడ్స్ లో అతి పెద్ద వస్త్ర దుకాణంగా పేరు పొందింది ఆర్ ఎస్ బ్రదర్స్. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆర్ ఎస్ బ్రదర్స్.. తర్వాతి కాలంలో వచ్చిన షోరూంలు.. షాపింగ్ మాల్స్ తో కాస్త వెనుకబడినట్లుగా చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. తాజాగా అబిడ్స్ ఆర్ ఎస్ బ్రదర్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన రోడ్డుకు అనుకొని ఉండే నాలుగు అంతస్తుల ఈ భవనంలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి పదిగంటలకు దుకాణాన్ని మూసివేసి సిబ్బంది వెళ్లిన కొంత సేపటికి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
షార్ట్ సర్య్కుట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మొదట దుకాణం నుంచి పొగలు రావటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాసేపటికే పెద్ద ఎత్తున మంటలు చోటు చేసుకున్నాయి. అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. మంటల తీవ్రత కారణంగా దుకాణం తలుపుల్ని తీయటం సాధ్యం కానట్లుగా తెలుస్తోంది. తొలుత మొదటి అంతస్తులో మొదలైన మంటలు.. కాసేపటికే రెండు.. మూడు.. నాలుగు అంతస్తులకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.
అగ్నిప్రమాదం తీవ్రతకు షోరూం మొత్తం కాలి బూడిదైందని.. గంటల తరబడి చేసిన ప్రయత్నంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్‌తో షోరూంలోని వస్త్రాలు మొత్తం కాలిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.