ఇండియా టూవీలర్ మార్కెట్ లోని బడా కంపెనీలపై మోడీ డీమానిటైజేషన్ ఎఫెక్టు భారీగా పడింది. జనం చేతిలో డబ్బు లేక కొనుగోళ్లు ఆగిపోవడంతో గోడౌన్లలోని బళ్లు స్టాకయిపోయాయి. దీంతో మార్కెట్ లో 90 శాతం వాటా ఉన్న నాలుగు పెద్ద సంస్థలు హీరో మోటోకార్ప్ - హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా - బజాజ్ ఆటో - టీవీఎస్ మోటార్ కంపెనీలు తాత్కాలికంగా ప్రొడక్షన్ నిలిపివేశాయి.
వార్షిక నిర్వహణా పనుల నిమిత్తం ప్లాంట్లను మూసివేసినట్టు బయటకు చెబుతున్నప్పటికీ అసలు కారణం సేల్స్ పడిపోవడమేనని టాక్. ఇండియాలో అత్యధికంగా టూ-వీలర్లను విక్రయిస్తున్న హీరో మోటో - వారం రోజుల పాటు ప్రొడక్షన్ నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. స్ప్లెండర్ - ప్యాషన్ - డ్యూయెట్ బైకుల తయారీని హరిద్వార్ - గురుగ్రామ్ ప్లాంట్లలో ఆపేశామని, దారుహెరా ప్లాంటులో మాత్రం పనులు సాగుతున్నాయని ప్రకటించింది.
ఇక రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న హోండా - 10 రోజుల పాటు ప్లాంటులో కార్యకలాపాలు ఆపివేశామని, యాక్టివా - యూనికార్న్ వాహనాల ఉత్పత్తి ఆగిందని తెలిపింది. పుణె కేంద్రంలో అవెంజర్ - పల్సర్ బైక్ ల తయారీని నిలిపినట్టు బజాజ్ ఆటో తెలిపింది. టీవీఎస్ మోటార్స్ సైతం ఇదే దారిలో వెళ్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/