'టాటా'ల మధ్య లొల్లికి సుప్రీంకోర్టు పుల్ స్టాప్ పెట్టింది. దేశంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన టాటాలో వివాదానికి స్వస్తి పలికింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలన్న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్ ఏటీ) తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. లా అప్పీలేట్ ట్రైబ్యూనల్ తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్సీఎల్ ఏటీ ఉత్తర్వులు రద్దు చేసింది.
టాటా గ్రూప్ నకు సంబంధించిన అన్ని పిటీషన్లను అనుమతించిన సుప్రీంకోర్టు సైరస్ మిస్త్రీ పిటీషన్లను తిరస్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.టాటా గ్రూపునకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి చట్టంలోని అంశాలు బాధ్యత వహిస్తాయని.. సైరస్ చేసిన విజ్ఞప్తులను కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
టాటా సన్స్ 2016లో మిస్త్రీని చైర్మన్ గా తొలగించి కొన్ని నెలల తర్వాత ఎన్ చంద్రశేఖరన్ ను నియమించింది. ప్రస్తుతం టాటా గ్రూప్ చైర్మన్ గా చంద్రశేఖరన్ కొనసాగుతున్నారు. మిస్త్రీ తన తొలగింపునకు వ్యతిరేకంగా న్యాయపోరాటం మొదలు పెట్టారు. ఈ పోరాటంలో ఎట్టకేలకు టాటా గ్రూప్ విజయం సాధించింది. టాటా సన్స్ లో మిస్త్రీ కుటుంబానికి 18.47 శాతం వాటా ఉంది.