సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, ప్రజల ఆలోచన ఎలా ఉంది అనే విషయాలపై సర్వేలు చేస్తుంటారు. ఆ సర్వేల్లో ప్రజల అభిప్రాయాలను పర్సంటేజీలుగా గుర్తించి, గాలి అలా ఉందని చెబుతారు. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారా? ట్రంప్ గెలుస్తారా? అనే విషయంపై రకరకాల సర్వేలు జరిగాయి. వాటిలో చాలా సర్వేలు హిల్లరీ ముందంజలో ఉన్నారని చెప్పగా... తాజాగా విడుదలయిన ఒక సర్వే మాత్రం ట్రంప్ ముందుకు వస్తున్నారని తెలిపింది. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే... అసలు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ఎన్నికల పై పౌరులు ఎలా స్పందిస్తున్నారు, వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. అనే విషయాలపై సర్వే జరిగింది. ఈ సర్వేలే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అమెరికా ఎన్నికలపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఉండగా... అమెరికన్లు మాత్రం అంత వాటిపై ఆసక్తి చూపడం లేదట. న్యూయార్క్ టైమ్స్ పత్రిక/సీబీఎస్ న్యూస్ పోల్ లో ఎన్నికల ప్రచార తీరుతో అమెరికన్లు తీవ్రంగా విరక్తి చెందారని తేలింది. ఈ పోల్ లో ఎక్కువ శాతం ఓటర్లు తాజా అమెరికా రాజకీయాల పట్ల అసహ్యం వ్యక్తం చేశారట. ఈ విషయాలపై స్పందించిన అమెరికా ఓటర్లు... డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ - రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ల్లో ఎవరూ నిజాయితీపరులు కాదని, దేశాన్ని ఐక్యంగా ఉంచి పాలించే సామర్థ్యం వారిద్దరికీ లేదని తేల్చేశారట!
సాదారణంగా ప్రతీ ఎన్నికల్లోనూ ప్రచారంలో ఆసక్తి ఉండేది కానీ... తాజా ఎన్నికల ప్రచారాలను చూస్తుంటే ఆసక్తి కంటే విరక్తి ఎక్కువగా చెందామని ప్రతీ పది మంది ఓటర్లలో 8 మందికి పైగా వెల్లడించడం గమనార్హం. రాజకీయ నాయకుల్లో హుందాతనం తగ్గితే... అగ్రరాజ్యం అని మరే దేశప్రజలైనా ఆయా నేతలపై గౌరవం పోగొట్టుకుంటారనేది మరోసారి తేటతెల్లమైంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/