స్టాన్ ఫోర్డ్ స్టూడెంట్ గా నోబుల్ ప్రైజ్ విన్నర్

Update: 2015-10-12 07:37 GMT
అతి పిన్న వయసులోనే నోబుల్ బహుమతిని సొంతం చేసుకున్న పాక్ సాహసి మలాలా ఇప్పుడు కాలేజీలో జాయిన్ కావాలని భావిస్తున్నారు. చిన్నారుల చదువు కోసం ఉద్యమించి.. తీవ్రవాదులతో తగువు పెట్టుకునేందుకు సిద్ధమైన సాహసికి నోబుల్ వరించటం తెలిసిందే.

ప్రస్తుతం 18 ఏళ్ల మలాల బర్మింగ్ హోం పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన మలాల..ఇప్పుడు కాలేజీలో చేరాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పలు విశ్వవిద్యాలయాల్ని సందర్శిస్తున్న ఆమె.. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాలని భావిస్తోంది. స్టాన్ ఫోర్డ్ లో రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న మలాల.. తాను అనుకున్నట్లు జరిగితే.. ఆమె స్టాన్ ఫోర్ట్  స్టూడెంట్ అవుతారు.
Tags:    

Similar News