భారత్ లో కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ ల పేరిట బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలను తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రోజుకొక ప్లాన్ తో తనని తాను రక్షించుకునే పనిలో పడ్డాడు. మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఈ లిక్కర్ బాస్ ను ఇండియా కి తీసుకురావాలన్న కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. ఈసారి బాగా ఉచ్చు బిగించారు ఇండియా కి రావడమే తరువాయి అనుకునే సమయంలో ఎదో ఒక విధంగా బురిడీ కొట్టిస్తూ తప్పించుకుంటున్నాడు.
ఈ తరుణంలో తాజాగా విజయ్ మాల్యా నుంచి కొత్త ప్రతిపాదన వచ్చింది. మొత్తం పదిహేడు బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలను చెల్లించేందుకు సిద్దమేనని అని , అయితే.. ఓ షరతు అంటు మెలిక పెట్టాడు. తాను బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలని కట్టాలస్సిన మొత్తంను చెల్లించేందుకు సెటిల్ మెంట్ ఆఫర్ మొత్తంలో కేవలం 13,960 కోట్లను చెల్లిస్తానని వెల్లడించాడు. గత నెలలో సుప్రీంకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ లో రూ .13,960 కోట్ల పరిష్కారం లభించింది. దీనితో ప్రతిసారి ఏదో ఒక ఆఫర్ చూపించి విజయ్ మాల్యా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ అన్నారు. విజయ్ మాల్యా భారత్ కి రాకముందే మొత్తం డబ్బులను జమ చేయాలని మాల్యా తరఫు న్యాయవాదిని ఆయన ఆదేశించారు.