హోరాహోరీగా సాగుతోంది బెంగాల్ అసెంబ్లీ పోరు. రెండు బలమైన పార్టీలు తలపడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని తెలియజేసే ఎన్నికలుగా వీటిని చెప్పాలి. ఈ రాష్ట్ర ఎన్నికల్లో ప్రభావాన్ని చూపించటం కోసం ప్రధాని మోడీ అర్జెంట్ గా బంగ్లాదేశ్ లో పర్యటిస్తూ.. బెంగాలీల విషయంలో తనకెంత ప్రాధాన్యత ఉందో తెలియజేసేలా చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగాలీలపై భావోద్వేగ అస్త్రాన్ని ప్రయోగించేలా సాగుతున్న ఆయన పర్యటన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా టీఎంసీ అధినేత కమ్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇరుకున పడే ఒక ఆడియోను విడుదల చేసింది బీజేపీ.
ఆమె మాట్లాడినట్లు చెబుతున్న ఆడియోలో.. ఒక నేతనను మళ్లీ పార్టీలో చేరాలని కోరటంతో పాటు.. నందిగ్రామ్ లో తన గెలుపు కోసం సాయం చేయాలన్న అభ్యర్థన అందులో ఉంది. ఇందుకు తానెలాంటి సాయమైనా చేస్తానన్న మాట స్పష్టంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి మమత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు అత్యంత నమ్మకస్తుడైన నేతగా ఉన్న సువేందు అధికారి ప్రాతినిధ్యం వహించే ఆ నియోజకవర్గంలో పంతం కొద్దీ బరిలోకి నిలిచారు దీదీ.
ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావటంతో నందిగ్రామ్ పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల్లో విజయం కోసం ఇరువురు తమ శక్తియుక్తుల్ని ధార పోస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అధిక్యతను ప్రదర్శించాలని తపిస్తున్నారు. ఇలాంటి వేళ.. నందిగ్రామ్ లో సువేందుకు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్ పాల్ అనే నేతతో మమత మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో బయటకు వచ్చింది. గతంలో దీదీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అతను.. సువేందుకు అధికారితో పాటు పార్టీ మారిపోయి బీజేపీలోకి చేరాడు.
ఇలాంటివేళ.. సదరు నేతతో మమత వ్యక్తిగతంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రళయ్ పాల్ కు ఫోన్ చేసి ఉంటారని.. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న అతను.. మొత్తం సంభాషణను రికార్డు చేసి ఉంటారని భావిస్తున్నారు. బీజేపీ విసిరిన ఈ బౌన్సర్ కు మమత ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక.. ఈ ఆడియోలో ఏమున్నదన్న విషయంలోకి వెళితే.. ‘నందగ్రామ్ లో నేను గెలవటానికి సహకరించు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’ అన్న స్పష్టమైన హామీ అందులో ఉంది. దీనికి ప్రళయ్ స్పందిస్తూ.. ‘అక్కా మీరు నాకు ఫోన్ చేశారు. అది చాలు. సువేందుకు ద్రోహం చేయలేను’ అని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. తాను ప్రస్తుతం బీజేపీ కోసం పని చేస్తున్నానని.. ఆ పార్టీకి మోసం చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఆడియో టేప్ పై బీజేపీ మండిపడింది.
అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తూ.. ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారు. బీజేపీ టీం ఒకటి బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారిని కలిసి.. ఈ ఆడియో క్లిప్ ను అందజేసింది. అయితే.. ఈ టేప్ వాస్తవికతపై దీదీ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రళయ్ పాల్ గతంలో తమ పార్టీ నేతేనని.. అతడితో మాట్లాడి.. సాయం చేయాలని కోరితే తప్పేముందని టీఎంసీ నేత కునాల్ ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.