తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై అభినందనల వర్షం కురుస్తోంది. ఆయన విజయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కంగుతినడం.. అదే సమయంలో ప్రత్యామ్నాయ కూటముల కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ పై వివిధ పార్టీల దృష్టిపడింది.
కేసీఆర్ కు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అధినేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ఆయనకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కర్ణాటక సీఎం హెచ్.డి.కుమారస్వామి కేసీఆర్ కు నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిసింది. ఈ విజయం నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబును పక్కన పెట్టి కేసీఆర్ తో జట్టు కట్టడానికి వివిధ పార్టీలు ముందు కొచ్చే అవకాశముంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పార్టీ తరఫున కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున కేసీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే సూపర్ స్టార్ కృష్ణ.. కేసీఆర్ ను అభినందిస్తూ ప్రకటన విడుదల చేయడం విశేషం.