కర్ణాటకలో ఫలితం తారుమారైంది.. గెలవాల్సిన కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోతుందనుకున్న బీజేపీ గెలిచేసింది. బీజేపీ అన్నా.. మోడీ అన్న కస్సుబుస్సమనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా కర్ణాటక ఎన్నికలపై తన మనోగతాన్ని విలేకరులతో పంచుకున్నారు. కాంగ్రెస్ చేసిన తప్పును వేలెత్తి చూపించారు. దేశ రాజకీయాల్లో బీజేపీ ని ఓడించాలంటే ఇలా చేయాలని సూచించారు..
కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమిపై మమతా బెనర్జీ స్పందించారు.. ‘కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన విజేతలకు అభినందనలు.. ఎవరైతే అక్కడ ఓడిపోయారో.. వారు మళ్లీ యుద్ధం మొదలు పెట్టాలి. కాంగ్రెస్ కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఈ ఫలితం మరోలా ఉండేది. చేజేతులా కాంగ్రెస్ పార్టీనే కర్ణాటకలో ఓడిపోయింది’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
మోడీ వ్యతిరేక శక్తులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని.. కేసీఆర్ ఆలోచనల్లోంచి వచ్చిన ఫెడరల్ ఫ్రంట్ ద్వారానే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమని మమత స్పష్టం చేశారు. పట్టింపులకు పోయి కర్ణాటకలో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ దెబ్బతిందని.. మున్ముందు బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న మోడీ, అమిత్ షాలకు ఫెడరల్ ప్రంట్ ద్వారా బుద్దిచెప్పాలని మమత సూచించారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు కలిసి ఉత్తరప్రదేశ్ లో బీజేపీని ఓడించాయని.. అన్నీ ప్రతిపక్ష పార్టీలు ఇలానే బీజేపీని ఎదుర్కోవాలని మమత సూచించారు..
మమత వ్యాఖ్యలు చూశాక కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ - బీజేపీలకు ప్రత్యామ్మాయంగా రూపొందుతున్న ఈ ఫ్రంట్ అవసరాన్ని మమత మరోసారి గుర్తు చేయడం కేసీఆర్ లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.