మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి షాకులివ్వటమే కానీ షాక్ లు తీసుకున్నది లేదు. అలాంటి ఆయనకు సరికొత్త అనుభవాన్ని కలిగించారు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ. త్వరలో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు అసదుద్దీన్ ఓవైసీ డిసైడ్ కావటం.. అందులో భాగంగా ఇప్పటికే బెంగాల్ నేతల్ని హైదరాబాద్ కు పిలిపించుకొని మరీ చర్చలు జరిపారు.
తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బెంగాల్ కు వెళ్లి రాజకీయాలు చేసిన వచ్చిన ఆయనతో ఎదురయ్యే ముప్పును దీదీ బాగానే అంచనా వేసినట్లున్నారు. తాజాగా ఆమె వేసిన ఎత్తు అసద్ కు దిమ్మ తిరిగేలాంటి షాకిచ్చిందని చెబుతున్నారు. బెంగాల్ మజ్లిస్ రాష్ట్ర తాత్కాలిక అధ్యక్షుడు ఎస్ కే అబ్డుల్ కలం తన మద్దతుదారులతో కలిసి మమత పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో.. బెంగాల్ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న అసద్ కు.. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కొద్ది నెలల క్రితం బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 20 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది. మార్చి - ఏప్రిల్ మధ్యలో జరిగే బెంగాల్ ఎన్నికల్లో దీదీకి దెబ్బ వేసేందుకు వీలుగా మజ్లిస్ ను బీజేపీనే దించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. వీటిని అసద్ ఖండిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం బెంగాల్ లో మజ్లిస్ కు భారీగా దెబ్బ తగిలినట్లుగా అంచనా వేస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై అసద్ ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.