పశ్చిమ్ బెంగాల్ రాజకీయాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైనా ప్రభావం చూపిస్తున్నాయి. అక్కడి పరిణామాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు భిన్న వైఖరులు కనబరుస్తున్నారు. పశ్చిమబెంగాల్ లో శారద పొంజి కుంభకోణం ఆరోపణలపై విచారణ కోసం కోల్ కతా పోలిస్ కమిషనర్ ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం.. కోల్ కతా పోలీస్ కమిషనర్‌కు మద్దతుగా కేంద్రంపై మండిపడుతూ మమత బెనర్జీ ధర్నాకు దిగడం తెలిసిందే. కేంద్రం - బెంగాల్ మధ్య బిగుసుకుంటున్న ఈ రాజకీయ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భిన్న వైఖరులు కనబరుస్తున్నారు. మొన్నమొన్నటి వరకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మమత బెనర్జీతో కలిసి నడిచిన కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. ఆమెకు సపోర్టుగా ఒక్క మాటా మాట్లాడలేదు. అసలిదంతా తనకేమీ తెలియదన్నట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. దీంతో కేసీఆర్ మోదీకి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయరన్న విషయం స్పష్టమైపోయింది.
అదేసమయంలో ఫెడరల్ ఫ్రంటులో భాగం లేనప్పటికీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై పోరాడుతున్నారన్న కారణంతో చంద్రబాబు మాత్రం వెంటనే మమతకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. త్వరలో కోల్ కతా వెళ్లడానికి రెడీ అయిపోతున్నారు. జగన్ దిల్లీ రావడంతో ఆయన అక్కడ ఏం చేస్తారో.. మీడియాలో ఎక్కడ కవరేజ్ వస్తుందో అన్న టెన్షన్ తో బాబు కూడా ఏదో ఒక పని పెట్టుకుని దిల్లీ వచ్చేసి మీడియా సమావేశాలు పెడుతున్నారు. లేదంటే ఈ సరికే ఆయన కోల్ కతాలో వాలిపోయేవారేమో.
కేసీఆర్ కాస్త మోదీతో అవగాహనతో ఉండడం.. చంద్రబాబేమో మోదీ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవడంతో ఇలాంటి విషయాల్లోనూ రాజకీయంగా ఇద్దరి దారులు వేరుగానే ఉంటున్నాయి. మరోవైపు మమత కూడా మోదీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇటీవల బీజేపీ ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోల్ కతా వస్తే ఆయన హెలికాప్టర్ దిగడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఫోన్లో మాట్లాడితే అది సభలో ప్రసంగంలా వినిపించాల్సి వచ్చింది.
అంతేకాదు... మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేస్తూ ఆమె భారీ ర్యాలీ కూడా తీశారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెపై కాస్త ఆశ పెట్టుకుంది. ఆమె మోదీకి వ్యతిరేకంగా మారడంతో కేసీఆర్ అటు చూడడం మానేశారు. మొన్నటి బెంగాల్ ర్యాలీకి కూడా దేశంలోని చాలా పార్టీల నేతలు వెళ్లినా కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టేశారు. ఆ సమావేశానికి చంద్రబాబు వెళ్లారు. ఇప్పుడు కూడా చంద్రబాబు బెంగాల్ వెళ్లి మమత దీక్షకు సంఘీ భావం ప్రకటించనున్నారు.
చంద్రబాబు ఇప్పటికే ఓపెన్ గా తన రాజకీయ వైఖరిని ప్రదర్శించుకున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఇంకా ఆ బహిరంగ రహస్యాన్ని గుట్టుగానే ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. మోదీతో దోస్తీని ఎన్నికల ముందు బయటపెట్టుకోకుండా తంటాలు పడుతున్నారు. కానీ, తాజాగా మమత ధర్నాతో కేసీఆర్ స్టాండ్ పూర్తిగా స్పష్టమైపోయింది.