ఒకరు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరొకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతానికి దేశంలో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యల్లా తయారైన ముఖ్యమంత్రులు. ఒకరు ఈ మధ్య నే పదవిని అధిష్టిస్తూ బీజేపీకి చావు దెబ్బ కొట్టారు.. మరొకరు బీజేపీని ఒక రాష్ట్రంలోనే అడుగుపెట్టకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈ ముఖ్యమంత్రులపై దాడులకు వస్తున్నారు.
అయితే ఈ ముఖ్యమంత్రులు కూడా తమ సత్తాను ప్రదర్శిస్తూ ఏదో విధంగా భారతీయ జనతా పార్టీకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మమతా దీదీ పలుమార్లు కేంద్రంతో పేచీ పెట్టుకొంది. బెంగాల్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ పట్ల దూకుడైన వైఖరితోనే వ్యవహరిస్తోంది దీదీ.
ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో సారి అధికారం చేపడుతూనే భారతీయ జనతా పార్టీని ఎంతగా దెబ్బతీశాడో వేరే వివరించనక్కర్లేదు. ఇప్పుడు బీజేపీ కూడా కేజ్రీవాల్‌తో వ్యవహరించకూడని రీతిలోనే వ్యవహరిస్తోంది. దీంతో వివాదాలు మొదలయ్యాయి.
కోర్టులు ఈ వ్యవహారాల్లో కేజ్రీవాల్‌కే అండగా నిలుస్తుండటం ఇక్కడ విశేషం. ఇప్పుడు మరింత విశేషం ఏమిటంటే.. ఈ వ్యవహారంలో తనకు సహకారం అందిచాల్సిందిగా కేజ్రీవాల్ బెంగాల్ ముఖ్యమంత్రిని కోరుతున్నాడు. ఆమె కూడా కేజ్రీవాల్‌కు మద్దతుగా ట్వీట్ చేసి.. కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలుస్తోంది.
ఈ విధంగా ప్రజాబలంతో ఉన్న ఈ ఇద్దరు సీఎంలూ కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.