అమెరికాలో జాత్యాహంకారి చేతిలో హత్యకు గురైన తెలుగు ఎన్నారై శ్రీనివాస్ కూచిబొట్ల ఉదంతం అందరినీ కలచివేసిన ఉదంతం మనకు తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి 22న జరిగిన ఘటనలో పురింటన్ అనే వ్యక్తి ఆస్టిన్ బార్ లో కాల్పులు జరిపిన ఘటనలో కూచిబొట్ల ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇదే ఘటనలో అలోక్ మదసానిపై హత్యాయత్నం జరిగింది. జాతి వివక్షతోనే పురింటన్ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పిస్తోల్ తో కాల్పులు జరిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింటన్ అరుపులు పెట్టినట్లు సాక్షులు తెలిపారు. నిందితుడు పురింటన్ ను అడ్డుకున్న అమెరికా శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిల్లట్ ఇదే ఘటనలో హీరోగా ఆవిర్భవించాడు.
అయితే తాజాగా ఈ ఎపిసోడ్ లో కీలక ముందడుగు పడింది. నిర్దేశిత సమయాని కంటే ముందే ఈ కేసు విచారణకు వచ్చింది. వాయిదా ప్రకారం ఈ ఏడాది మే 8వ తారీఖున విచారణకు రావాల్సి ఉన్న ఈ కేసు మార్చి 6నే విచారణకు వచ్చింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం నాడు ఈ కేసులో జాన్ సన్ కంట్రీ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విదేశీయులు అమెరికాలోని ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారన్న జాతివిద్వేష ప్రచారంతో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నికైన కొత్తలో అమెరికాలో భారతీయులపై పలు చోట్ల దాడులు జరిగాయి.‘మీరు మా దేశం నుంచి వెళ్లిపోండి’ అని అరుస్తూ ప్యూరింటన్ గొడవకు దిగి శ్రీనివాస్ ను తుపాకీతో కాల్పి చంపాడు. జాత్యాంహకార దాడి - మారణాయుధాలు కలిగి ఉండటం అనే అభియోగాలు పురింటన్ పై నమోదు అయ్యాయి. ఈ ఫిబ్రవరిలో జరిగిన ఈ కాల్పుల ఘటనను జాతి వివక్ష దాడిగా విచారణ చేపట్టినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అలోక్ అనే మరో భారతీయ యువకుడిని కూడా హత్య చేయాలని చూశాడని - ఈ దాడిని అడ్డుకోబోయిన ఒక శ్వేతజాతీయుడిని కూడా గాయపరిచాడని కేసు విచారణ సందర్భంగా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్డుకు తెలిపారు. అయితే తాను ఎలాంటి నేరం చేయలేదని ప్యూరింటన్ పేర్కొంటూ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు.
కాగా, కాల్పులు జరిపిన తరువాత ప్యూరింటన్ అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిస్సోరీలోని ఆపిల్ బీ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడి బార్ టెండర్ కు తాను చేసిన దాడి గురించి చెప్పాడు. ప్యూరింటన్ పై ఉద్దేశ పూర్వక దాడి, హత్య - హత్యాయత్నం అభియోగాలు దాఖలయ్యాయి. అభియోగాలు రుజువైతే ప్యూరింటన్ కు మరణశిక్ష లేదా - జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది మే8కి వాయిదా పడి తాజాగా విచారణకు వచ్చింది. శ్రీనివాస్ అమెరికాలోని గార్మిన్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.
కాగా, దారుణ హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమాలకు ఆ దేశం న్యాయం చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు తాత్కాలిక వర్క్ వీసాను మంజూరు చేసింది. శ్రీనివాస్ హత్య తర్వాత అంత్యక్రియల కోసం ఆమె భారత్‌కు రావడంతో సునయన అమెరికాలో నివాస హక్కును కోల్పోయారు. తాను అమెరికాలో ఉండటానికి, అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఆమె ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వర్క్ వీసా మంజూరు కోసం ఆ దేశానికి చెందిన ఎంపీ యోడర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చివరికి సునయనకు వర్క్ వీసా మంజూరయ్యేలా చూశారు.