కరోనా మహమ్మారి ..ప్రస్తుతం దేశంలో రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీనితో దేశ వ్యాప్తంగా రవాణా మొత్తం నిలిచిపోయింది. అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేశారు. అంతే కాకుండా ఒక రాష్టంలోని వాహనాలను ఇతర రాష్ట్రాలలోకి రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాక్సీ, కారు, బస్సు, రైలు మరియు విమానసర్వీసులన్నీ పూర్తిగా మూసేసారు.
భారత్ మొత్తం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి వివిధ మార్గాలలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చాలమంది ప్రజలు సుదూర ప్రాంతాలకు కూడా కాలినడకన చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ముంబయికి చెందిన ఒక వ్యక్తి 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోని తన ఇంటికి చేరుకున్నాడు. ప్రయాణించేటప్పుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించబడటం గమనార్హం.
పూర్తి వివరాలు చూస్తే ..ముంబై విమానాశ్రయంలో పని చేస్తున్న ప్రేమ్ మూర్తి పాండేకు రవాణా సేవలు ఎలా పనిచేస్తాయో బాగా తెలుసు. ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించినప్పటికీ, అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి ఎటువంటి పరిమితులు లేవని తెలుసు. ఇదే అంశాన్ని ఉపయోగించుకొని ఇంటికి చేరుకోవాలనుకున్నాడు. ఈ కారణంగానే ప్రేమ్ మూర్తి పాండే తన ఇంటికి చేరుకోవడానికి ఉల్లిపాయ వ్యాపారిగా మారాలని నిర్ణయించుకున్నాడు. దీనితో వెంటనే నాసిక్ లోని పింపాల్ గావ్ లో మినీ ట్రక్కును ఉపయోగించుకోవడానికి నిర్ణయించకున్నాడు. ఇందులో భాగంగా పింపాల్ గావ్ మార్కెట్ నుంచి రూ. 22.32 లక్షలకు 25.5 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేశాడు.
ఆ తర్వాత ఉల్లిపాయలు తీసుకెళ్లేందుకు ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. ట్రక్కు యజమానికి రూ. 77,500 చెల్లించారు. పాండే యొక్క ప్రణాళిక పూర్తి విజయవంతమైంది. మొత్తం ప్రయాణంలో వాటిని ఎక్కడా పోలీసుల ఆపలేదు. ఉల్లిపాయలను అమ్మేందుకు ఉత్తరప్రదేశ్ లోని ముండేరా మార్కెట్‌కు వెళ్లినప్పుడు, ఇంత పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తరువాత, వారు కోట్వా ముబారక్ గ్రామంలోని ఉల్లిపాయలతో తమ ఇంటికి వెళ్ళారు. ఆలా ఇంటికి కి అయితే చేరాడు కానీ , ఇంటికి చేరుకున్న తరువాత మొత్తం సమాచారం అందరికి తెలిసి పోయింది.