కంప్లైంట్ చేసేందుకు వచ్చి కానిస్టేబుల్ వేలు కట్ అయ్యేలా కొరికాడు

Update: 2019-10-23 05:03 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా..నిజంగా అంటే నిజంగా జరిగిన సంఘటన ఇది. కంప్లైంట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒకతను.. కానిస్టేబుల్ చిటికెన వేలును తెగే వరకూ కొరికేసిన అరుదైన ఘటనగా దీన్ని చెప్పాలి. ఖమ్మం నగరంలోని నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన మస్తానో చేసిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనలోకి వెళితే..

సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత మస్తాన్.. మరో ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కంప్లైంట్ చేసేందుకు స్టేషన్ కు వచ్చినట్లుగా చెప్పిన మస్తాన్.. అతను చెప్పే వివరాల్ని సేకరించే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ మన్సూరలీ తొడ భాగంలో కొరికాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న కానిస్టేబుల్ కు మరోసారి.. అతని చిటికెన వేలును నోటితో గట్టిగా పట్టుకొని.. ముందు భాగం ఉడిపడే వరకూ కొరికేశాడు.

అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం నుంచి తేరుకున్న స్టేషన్ సిబ్బంది మస్తాన్.. అతనితో వచ్చిన ఇద్దరిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మిగిలిన ఇద్దరూ పారిపోయారు. అదే సమయంలో మస్తాన్ మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకిలా చేశావంటూ విచారిస్తున్న ఏఎస్ ఐ మీదా అతను దాడి చేసే ప్రయత్నం చేశాడు.

అంతేకాదు.. స్టేషన్ లోని అద్దాలను.. ఫర్నీచర్ ను ధ్వంసం చేసి గందరగోళాన్ని క్రియేట్ చేశారు. గడిచిన కొన్నేళ్లుగా అనూహ్యంగా మస్తాన్ ప్రవిస్తున్నట్లుగా గుర్తించారు. గతంలో రైలు పట్టాల మీద తానే స్వయంగా కాళ్లను పెట్టుకోవటంతో రెండు కాళ్లు తెగిపోయినట్లుగా గుర్తించారు. మరి.. ఇలాంటి సిత్రమైన పనులు చేసే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News