ఓఎల్ ఎక్స్ అమ్మేయండి బాస్ అంటూ ఆన్ లైన్లో పాపులర్ గా మారిన వెబ్ సైట్. పాత వాటిని అమ్మిపెట్టే ఈ కామర్స్ దుకాణం. ఇప్పుడది రూట్ మార్చినట్టుంది. పోయిన వాటిని వెతికి తీసుకువచ్చేందుకు ఉపయోగపడుతోంది. నిజం. ఈ వార్త చదివితే మీరు అవుననే అంటారు కూడా.
దేశ రాజధాని ఢిల్లీని ఆనుకొని ఉన్న నోయిడా సెక్టార్ 1 లో నివాసం ఉండే ప్రాపర్టీ డీలర్ కుల్వంత్ సింగ్ సెకండ్ హ్యాండ్ కారు కోసం ఓఎల్ ఎక్స్ లో సెర్చ్ చేస్తుంటే.. తన కారే అమ్మకానికి పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. గతేడాది ఆగస్టులో తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు చోరీకి గురైంది. పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశాడు. కారు ఎంతకీ దొరకకపోవడంతో సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఓఎల్ ఎక్స్ లో వెతుకుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్ 4సీఆర్ 0757 ఉన్న తన కారును చూశాడు. వెంటనే యాడ్ ఇచ్చిన వ్యక్తితో కారు గురించి మాట్లాడాలని కోరాడు. అతని దగ్గరకు వెళ్లేమందు పోలీసులను కూడా తన వెంట తీసుకువెళ్లాడు. కారు యాడ్ ఇచ్చిన వ్యక్తిని లోనీలో నివసించే అహ్మద్ గా పోలీసులు గుర్తించారు. తాను నివసించే ప్రాంతంలోనే ఉండే మరో వ్యక్తి జుల్ఫికర్ ఆ కారును తనకు అమ్మినట్టు అహ్మద్ తెలిపాడు. ప్రధాన నిందితుడు జుల్ఫికర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలా పాత కారు కొనుక్కుందామంటే కొట్టేసిన కారునే ఓఎల్ ఎక్స్ తిరిగి తనకు అందించడంపై సింగ్ ఖుష్ అవుతున్నాడు. మంచి కారును ఇస్తుందనుకుంటే...తన కారు తనకే ఇచ్చిందంటూ ఓఎల్ ఎక్స్ కు ఫిదా అయిపోయాడు సింగ్.