ఇప్పటివరకూ భార్యల్ని అమ్మకానికి పెట్టిన భర్తల భాగోతం తెలిసిందే. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. తనను ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ ను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన ప్రబుద్దుడి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. తనకే మాత్రం హక్కు లేని ప్రియురాలిపై కోపంతో ఆమెను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన తీరును పలువురు తిట్టి పోస్తుంటే.. మరికొందరు.. ఎంచక్కా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్న వైనం చూస్తే తల తిరగాల్సిందే.
డేల్ లీక్స్.. కెల్లీ గ్రీవ్స్ అనే జంట ప్రేమించుకుంటున్నారు. ప్రేమికులు అన్నాక కోపతాపాలకు కామనే కదా. అలానే ఏదో ఇష్యూలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎపిసోడ్ లో డేల్ ను కెల్లీ కొట్టింది. అంతే.. తన ప్రియురాలిపై అతగాడు తీవ్రంగా రగిలిపోయాడు. పగతో ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఆమెకు దిమ్మ తిరిగేలా షాకివ్వాలని భావించిన అతడు.. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఈబేలో అమెను అమ్మకానికి పెట్టేశాడు.
ఆమె ప్రవర్తన.. శారీరక సౌందర్యం గురించి ప్రకటన ఇచ్చి.. తన గర్ల్ ఫ్రెండ్ ను అమ్ముతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇలాంటి తిక్క ప్రకటనలకు ఎలాంటి స్పందన ఉండదని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
ఈ ప్రకటనను 81 వేల మంది రావటమే కాదు.. పలువురు ఈ యాడ్ కు రియాక్ట్ కావటం గమనార్హం. ఒక వ్యక్తి అయితే రూ.68 లక్షలు ఆఫర్ చేసి.. ఆమెను సొంతం చేసుకుంటానని ముందుకు వచ్చాడు. ఇక.. కెల్లీని డ్రైవ్ కు తీసుకెళతామని అతడికి పెద్ద ఎత్తున మేసేజ్ లు వచ్చాయి. ఏదో కోపంతో ఇలా చేస్తే.. ఇంత రెస్పాన్సా?అన్నది ఒకటైతే.. మానవ శరీర భాగాలతో వ్యాపారమా?అంటూ పలువురు తిట్టి పోయటంతో కళ్లు తెరిచిన ఈబే.. వెంటనే ఈ దరిద్రపు యాడ్ ను తొలగించింది. ఇక.. ఈ మొత్తంగా వ్యవహారంలో బాధితురాలిగా మారిన కెల్లీ స్పందన తెలియరాలేదు. ఈ ప్రకటన ఇచ్చిన డేల్ పై తీవ్రమైన నేరాన్ని నమోదు చేయాలన్న డిమాండ్ పలువురి నోట రావటం గమనార్హం.