గత కొద్దికాలంగా ఉగ్రవాదుల చర్యలకు టార్గెట్ అయిన ఫ్రాన్స్‌లో మరోమారు కలకలం రేగింది. ఈ దఫా బాంబు దాడి వంటి ఘటన కాకుండా ఏకంగా ఓ దుండగుడు మహిళలను పొడిచేశాడు. ``అల్లాహో...అక్బర్`` అని నినదిస్తూ కత్తితో పొడిచి మహిళలను చంపేశాడు. ఫ్రాన్స్ లోని మర్సీల్లె నగరంలో సెయింట్ చార్లెస్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సంఘటనకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అక్కడికక్కడే కాల్చిచంపారు. మరోవైపు ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది!
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం....నల్లదుస్తులు ధరించిన దుండగుడు రైల్వేస్టేషన్ ను సమీపించి ఒక యువతిని గొంతు కోసి హతమార్చాడు. ఆ వెంటనే సమీపంలోని మరో మహిళను సైతం ఇదే రీతిలో పైశాచికంగా హత్య చేశాడు. ఛాతిపై - కడుపులో కత్తితో పొడవడంతో సదరు యువతి అక్కడే ప్రాణాలు విడిచారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ సమయంలో ఆ దుండగుడు అల్లాహో అక్బర్ అంటూ నినదించారని వారు వివరించారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువతులు 17 - 20 ఏళ్ల వయస్సున్న వారిగా అంచనా వేస్తున్నారు. దాడికి పాల్పడి హతుడైన యువకుడి వయసు పాతిక నుంచి 30 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మీడియా విభాగమైన అమాక్ వెల్లడించింది. ఇదిలాఉండగా.... సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్ ప్రకటన చేసిన నేపథ్యం, సంఘటన జరిగిన తీరు నేపథ్యంలో ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని నిర్దారణకు వస్తున్నారు. పారిస్ లోని స్పెషల్ ప్రాసిక్యూటర్ ఈ ఉగ్రవాద ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారని సమాచారం. కాగా, ఈ దుండగుడు సాధారణ నేరస్తుడని స్థానిక మీడియా అంచనా వేస్తోంది.