పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నం..కారణం ఇదీ

Update: 2019-07-30 18:40 GMT
పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు స్టేషన్ ఎదుటే నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ దగ్గర అందరూ చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న నాగరాజును పోలీసులు నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. అనంతరం అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉంది.

తనకు - తన బాబాయిలకు మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు - ఆస్తి వివాదం ఉన్నాయని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదుల చేసుకున్నామని.. అయితే.. విచారించి న్యాయం చేయాల్సిన పోలీసులు తనను టార్గెట్ చేసి వేదిస్తున్నారని.. ముఖ్యంగా ఎస్ ఐ మురళీకృష్ణ వేధించాడని నాగరాజు ఆరోపించాడు.

తన బాబాయి తనను చంపడానికి ప్రయత్నించారని చెప్పినా కూడా ఎస్‌ ఐ వారికే వత్తాసు పలికి తనను వేధిస్తున్నాడని.. తన నుంచి ఎస్‌ ఐ డబ్బులు డిమాండ్ చేశారని.. రెండు రోజులుగా డబ్బుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో ఇచ్చుకోలేక ఇలా చేశానని నాగరాజు చెబుతున్నాడు. అయితే.. ఎస్‌ ఐ మురళీ కృష్ణ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ప్రస్తుతం నాగరాజు పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.


Full View


Tags:    

Similar News