పారిశ్రామిక వేత్తలన్న వెంటనే నిత్యం బిజీబిజీగా ఉండటం.. ఎడతెగని షెడ్యూల్స్ లో పనుల ఒత్తిళ్లతో మునిగిపోయి ఉంటారు. ఇక.. బడా బడా బిజినెస్ మాగ్నేట్స్ పరిస్థితి.. చెప్పాల్సిన అవసరమే ఉండదు. ప్రతి నిమిషాన్ని రూపాయిలతో లెక్కించేటట్లుగా వారి షెడ్యూల్ ఉంటుంది. ఇలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతి కొద్దిమంది పారిశ్రామికవేత్తల్లో మహేంద్ర ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహింద్ర ఒకరు.
ఎన్ని పనులు ఉన్నా.. సోషల్ మీడియాలో ఆయన యమా యాక్టివ్ గా ఉంటారు. తనకు పోస్ట్ చేసిన వాటిల్లో ఆసక్తికరమైన వాటికి వెంటనే రియాక్ట్ కావటమే కాదు.. కొన్ని సామాజిక అంశాల మీద ఆయన స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ కు బదులిచ్చారు.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా నగర రహదారులు నదుల మాదిరి మారిన వేళల్లో వాహనాలు తీసుకొని రోడ్ల మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి. అయితే.. తనకు అలాంటి ఇబ్బంది లేదని.. మహీంద్రా టీయూవీ 300 మాత్రం నాలుగు అడుగుల నీళ్లు రోడ్ల మీద ఉన్నా.. అలవోకగా వెళ్లిపోతుందంటూ ఒక వాహనదారుడు ట్వీట్ చేశాడు. ఈ మెసేజ్ ను మహీంద్రా ఆనంద్ ఫోటో పెడుతూ.. దానికి ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు.
నాలుగు అడుగుల లోతులోనూ మహేంద్రా వెహికిల్ డ్రైవ్ చేయటం వినటానికి బాగుందని.. సంతోషంగా ఉందని.. కానీ సురక్షితంగా ఉండాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కారును పరీక్షించటం అంత మంచిది కాదని.. ఇదేమీ త్రివిధ దళాల వాహనం ఎంతమాత్రం కాదంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. తన మెసేజ్ తో నెటిజన్లను మహీంద్రా ఆనంద్ మరోసారి ఆకట్టుకున్నారు.