కేరళలో చదువుకోవడానికి కూడా డబ్బులు లేక బీడీలు చుడుతూ అష్టకష్టాలు పడ్డ ఓ బాలుడు ఇప్పుడు ఏకంగా అమెరికా జడ్జీగా ఎదిగాడు. తోటి వారు సాయం చేయకపోతే చదువు కొనసాగించలేని దుస్థితి నుంచి అమెరికా కోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. పూటకు లేని రోజుల్లో సాయం కోరే స్థాయి నుంచి నలుగురికీ న్యాయం అందించే ఎత్తుకు చేరారు. ఆయనే సురేంద్రన్. ఆయన స్ఫూర్తిదాయక స్టోరీ ఇప్పుడు అందరికీ ప్రేరణను అందిస్తోంది.
అమెరికాలోని టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ-అమెరికన్ సురేంద్రన్ కె పటేల్ ఆదివారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 8, 2022న జరిగిన టెక్సాస్ 240వ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ఎడ్వర్డ్ క్రెనెక్‌పై కేరళలోని కాసరగోడ్‌కు చెందిన పటేల్ విజయం సాధించారు. దినసరి కూలీగా ఒకప్పుడు కనీసం పాఠశాల చదువు చదువుకోలేని దుస్థితి నుంచి ఇతరులు సహాయం చేస్తే చదువుకొని ఎదిగి ఇప్పుడు అమెరికాలో పట్టేల్ జడ్జిగా ఎదిగాడు.
-సురేంద్రన్ కే పటేల్ లైఫ్ జర్నీ
పటేల్ చిన్నతనంలో పేదరికంలో పుట్టి చాలా కష్టపడ్డాడు. తన చదువును తాత్కాలికంగా మానేశాడు. అతను చిన్న రోజుల్లో ఒక బీడీ కర్మాగారంలో కూలీగా పనిచేశాడు. ఇంటిల్లిపాది పనిచేస్తే కానీ పూటగడవని పరిస్థితి. దీంతో సురేంద్రన్ కూడా చిన్నతనం నుంచే పనిచేసేవాడు. సోదరితో కలిసి బీడీలు చుట్టడానికి వెళ్లేవాడు. ఇతర కూలీ పనులు చేసేవాడు. ఇవన్నీ చేస్తూనే చదువుకునేవాడు. పదోతరగతి తర్వాత చదువు మానేసి పూర్తిగా బీడీలు చుట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఏడాది గడిచార ఆదాయం రావడంతో చదువును కొనసాగించాలని భావించాడు. ఓ ప్రభుత్వ కళాశాలలో చేరి చదువుతూనే కూలీ పనులకెళ్లేవాడు. సెలవులు ఎక్కువగా పెట్టడం వల్ల పరీక్షలు రాయించలేదు. చివరకు అధ్యాపకులను వేడుకోవడంతో పరీక్ష రాసి కాలేజీ టాపర్ గా నిలిచాడు. ఆ తర్వాత కాలికట్ ప్రభుత్వ లా కాలేజీలో చేరాడు. స్నేహితుల సాయంతో ఓ హోటల్ లో పనిచేస్తూ చదువు పూర్తి చేవాడు. 1995లో లా డిగ్రీ పూర్తి చేసి 1996లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశాడు. సీనియర్ న్యాయవాదిగా కేసులు వాదించారు.
2004లో శుభతో సురేంద్రన్ కు వివాహం జరిగింది. కొద్దిరోజులకే అమెరికాలో ఆమెకు ఉద్యోగ అవకావం వచ్చింది. దీంతో కుటుంబంతో కలిసి టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని ఒక ఉన్నత ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం పొందిన తన భార్యకు మద్దతు ఇవ్వడానికి భారతదేశాన్ని సురేంద్రన్ విడిచిపెట్టాడు.
2007లో, అతని భార్య ఒక ప్రధాన అమెరికన్ వైద్య శాలలో పని చేయడానికి ఎంపికైన తర్వాత పటేల్ కుటుంబానికి యునైటెడ్ స్టేట్స్‌లో స్థిరపడింది. ఈ జంట విజయవంతంగా శాశ్వత నివాసం పొందారు. 2009లో, పటేల్ టెక్సాస్ బార్ పరీక్షకు హాజరయ్యాడు . అతని మొదటి ప్రయత్నంలోనే దానిని క్లియర్ చేశాడు. పటేల్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్‌లో ఎల్ఎల్ఎంలో చేరారు. తరువాత, పటేల్ అమెరికా చట్టాలపై బాగా పట్టుసాధించాడు. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్‌లో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2011లో పట్టభద్రుడయ్యాక, పటేల్ నేర రక్షణ, కుటుంబ చట్టం, రియల్ ఎస్టేట్ మరియు లావాదేవీల వ్యవహారాలు మరియు పౌర మరియు వాణిజ్య వ్యాజ్యాలకు సంబంధించిన కేసులను నిర్వహించాడు. 51 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు జడ్జిగా ఎంపికై ఘనత సాధించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.