'మన అమరావాతి' కోసం హోరెత్తిన ట్వీట్లు

Update: 2015-10-21 19:23 GMT
నూతన ఆంధ్రప్రదేశ్‌ కలల రాజధాని.. కోట్ల అంధ్రుల కల.. తమ సొంత రాజధాని ''అమరావతి''కి పునాదులు పడుతున్నాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరగనుంది. ఏకంగా రెండు లక్షల మంది (ఒక అంచనా) సమక్షంలో.. భవిష్యత్తు తాలూకు ఆశల సాక్షిగా.. ఆశల తాలూకు అలజడి మధ్యన.. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పట్టణ నిర్మాణాన్ని చేపట్టునున్నారు. విజయదశమి నాడు గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెం వద్ద ఈ కార్యక్రమం జరనుంది.

ఇకపోతే ఈ కార్యక్రమానికి తమ వంతు సాయంగా.. ''మన అమరావతి.. మన రాజధాని'' అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో.. అదే క్యాప్షన్‌ ను ఒక పేపర్‌ పై రాసుకుని దానితో ఫోటో దిగి ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ లలో పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా అందరూ.. ఈ హ్యష్‌ ట్యాగ్‌ పిలుపు వినిపిస్తుందా అంటూ పెదవి విరవగా.. ఇప్పుడు ఈ హ్యాష్‌ ట్యాగే ఎక్కడ చూసినా ప్రతిధ్వనిస్తోంది. కాలేజీ స్టూడెంట్ల నుండి.. పసి పిల్లల వరకు.. సాఫ్టవేర్‌ ఇంజనీర్ల నుండి సినిమా నటుల వరకు.. సైంటిస్టుల నుండి పొలిటీషయన్ల వరకు.. అందరూ 'మన అమరావతి.. మన రాజధాని' అంటూ ట్వీట్లేశారు.

ఆ ఫోటోలను చూస్తుంటే.. ఆల్రెడీ సగం రాజధాని నిర్మాణం అయిపోయినంత హ్యీపీగా ఉందట ఆంధ్రులకు..  ఖచ్చితంగా తెలుగువారందరూ గర్వించదగిన క్యాపిటల్‌ కట్టేస్తానని చంద్రాబు అంటుంటే.. ఇదిగో మా హ్యాష్‌ ట్యాగ్‌ వందనం అంటూ వీరు అభివాదాలు తెలియజేస్తున్నారు. #మనఅమరావతిమనరాజధాని

Click Here For More Pics : http://goo.gl/8W9dk1
Tags:    

Similar News