తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళను అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఏప్రిల్ 14న ఆమె మృతిచెందింది. అయితే , ఆమెకి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా .ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అప్రమత్తమైన అధికారలు ముత్తరావుపల్లిలో హైఅలర్ట్ ప్రకటించారు. సదరు మహిళతో ఎంత మంది కాంటాక్ట్ అయ్యారనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. మంచిర్యాలలో ఆమెకు చికిత్స అందించిన వైద్యుల్లోనూ కలవరం మొదలైంది.
అసలు ఆమెకి కరోనా ఎలా సోకింది అంటే .. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన 46 ఏళ్ల ఓ మహిళ వారం రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆమెను కుమారులు మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెని పరీక్షించిన డాక్టర్ - హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, తమ తల్లికి కరోనా సోకే అవకాశమే లేదని వాదించిన ఆమె కుమారులు హైదరాబాద్ తీసుకెళ్లడానికి నిరాకరించారు. చివరికి వైద్యులు - అధికారుల ఒత్తిడి మేరకు బాధితురాలిని 108 అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అయితే, ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్లు అప్పటికి నిర్ధారణ కాకపోవడంతో కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా గాంధీలోని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో చేసేదేంలేక ఆమె కుమారుడు కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచారు. తమ తల్లి మృతి కి అధికారుల నిర్లక్షమే అని చిన్న కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేసాడు. మంచిర్యాలలోనే ఉంచి తగిన చికిత్స అందించి ఉంటే తన తల్లి బతికేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంబులెన్స్‌లో ఆస్పత్రుల చుట్టూ తిరిగే వరకే పుణ్యకాలం గడిచిపోయిందని మండిపడ్డాడు. అయితే , ఇప్పుడు ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఆమెకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది మిస్టరీగా మారింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు గ్రామస్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే , ఇప్పటివరకు తెలంగాణలో 726 కరోనా కేసులు నమోదు అయ్యాయి.