తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల పంతమే నెగ్గింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియామకంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ రాజీనామా చేశారు. టీపీసీసీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఈ పరిణామం జరిగిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా మాణిక్ రావు థాక్రేను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకూ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాణిక్కం ఠాగూర్ ను హైకమాండ్ గోవా కాంగ్రెస్ ఇన్ చార్జిగా నియమించింది. ఈయన తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని నివారించడంలో విఫలమయ్యారు. రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్టుగా ఉన్న మాణిక్యం ఠాగూర్ సీనియర్ల తిరుగుబాటును వ్యతిరేకించారు. వారి తీరును తప్పుపడుతూ వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్గానికి ఠాగూర్ ఫుల్ సపోర్టుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్లకు టార్గెట్ అయ్యారు.
రేవంత్ రెడ్డి చేతిలో మాణిక్యం ఠాగూర్ కీలుబొమ్మలా మారాడని.. ఆయన వల్లే పార్టీలో సమస్యలని.. ఇటీవల దిగ్విజయ్ సింగ్ కు కాంగ్రెస్ సీనియర్లు ఫిర్యాదు చేశారు. మాణిక్కం ఠాగూర్ ను తప్పిస్తే అంతా సర్దుకుంటుందని వివరించారట..
కాంగ్రెస్ తిరుగుబాటు నేతలైన ఉత్తమ్, మధుయాష్కీ, రాజనర్సింహ, జగ్గారెడడ్ి, బట్టి, మహేశ్వర్ రెడ్డి తదితర నేతలు ఠాగూర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ సాయంత్రమే ఠాగూర్ టీపీసీసీ గ్రూపుల నుంచి వైదొలిగారు.
కాంగ్రెస్ సీనియర్ల వల్ల పార్టీ ముందుకు వెళ్లని పరిస్థితి నెలకొంది. యువకులకు ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ రెడ్డిని, ఠాకూర్ ను సీనియర్లు తొక్కేస్తున్నారు. దీంతో వీరిద్దరినీ దించేయడానికి కుట్ర పన్నారు. ఠాగూర్ ను విజయవంతంగా సాగనంపిన కాంగ్రెస్ సీనియర్ల బ్యాచ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిపై పడింది.
ఆయనను కూడా సాగనంపితే ఇక కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేరు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాలేరు. ఈ సీనియర్లు రిటైర్ అయితే తప్ప కాంగ్రెస్ కు భవిష్యత్ ఉండదు. అసలు పోటీచేస్తే గెలవని.. ఫెయిత్ లేని వీరి వల్ల రేవంత్ రెడ్డి లాంటి వారిని నీరుగార్చడం.. పార్టీలో దెబ్బతీయడం కరెక్ట్ కాదన్న చర్చసాగుతోంది. కొత్త ఇన్ చార్జి థాక్రే అయినా తెలంగాణ కాంగ్రెస్ ను చక్కదిద్దుతాడా? లేదా? అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.