నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ మొదలైంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో లోక్ సభకు వచ్చిన ప్రధాని మోడీ.. బుధవారం మాత్రం మరోసారి దర్శనమిచ్చారు. సభ జరుగుతున్నా మోడీ హాజరు కాకపోవటంపై ఇరు సభల్లోని విపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. ప్రధాని సభకు రావాలని.. రద్దుపై తాను తీసుకున్న రద్దు నిర్ణయంపై వివరణ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. రాజకీయ పరిశీలకులు సైతం మోడీ సభకు వెళ్లకపోవటాన్ని తప్పు పడుతున్న వేళ.. ఈ రోజు ఆయన రాజ్యసభకు హాజరయ్యారు. నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమన్న విపక్షాలకు.. అధికారపక్షం సైతం ఓకే అనటంతో సభలో హాట్ హాట్ చర్చకు తెర తీసినట్లైంది.
మోడీ తీసుకున్న రద్దు నిర్ణయంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మాజీ ప్రధాని.. ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. నోట్ల రద్దు స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన అతి పెద్ద సంఘటిత నేరమని.. ఎందరో ప్రభుత్వ పెద్దలు ఈ నేరం వెనుక కుట్ర చేసినట్లుగా మన్మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోట్లరద్దుతోనే నల్లధనాన్ని పూర్తిగా అరికట్టొచ్చన్న మోడీ చేస్తున్న ప్రచారాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు.
అనాలోచితంగా తీసుకున్న రద్దు నిర్ణయం కారణంగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పిన మన్మోహన్.. ఈ అంశంలో ప్రభుత్వం ఎంతమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. సామాన్యులు తమ పనుల్ని మానుకొని ఏటీఎంల వద్ద.. బ్యాంకుల వద్దా గంటల కొద్దీ నిలబడుతున్నారని.. ప్రజల కష్టాలకు మోడీ సర్కారు నిర్ణయమే కారణంగా ఫైర్ అయ్యారు. నోట్ల రద్దు తర్వాత క్యూలైన్లో నిలుచున్న వారిలో 60..65 మంది వరకు మరణించినట్లుగా వార్తలు తనకు వస్తున్నాయని.. ఆ వార్తలు తనను తీవ్రంగా కలిచివేసినట్లుగా చెప్పారు. నోట్ల రద్దు వ్యవహారం బీజేపీ నేతలకు ముందే తెలుసన్న సందేహాల్ని మన్మోహన్ వ్యక్తం చేశారు. రద్దు కారణంగా ప్రజలకు ఎదురయ్యే కష్టాల్ని తీర్చేందుకు ఏం నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించిన ఆయన.. రద్దు నిర్ణయాన్ని వెల్లడించటానికి ముందే కొత్త కరెన్సీలతో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవటంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
నల్లధనాన్ని అడ్డుకట్ట వేయొద్దని తాను చెప్పటం లేదని.. నోట్ల రద్దు మంచిది కాదని కూడా తాను చెప్పటం లేదని.. అదే సమయంలో ప్రజాగ్రహం ఏ పార్టీకి లాభించదని.. ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పాలకులు వృధా అని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడిన తర్వాత సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఒకవైపు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు కేంద్రం మీడియా ద్వారా అంతా బాగుందని ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు.
రద్దు కారణంగా దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని చెప్పిన ఆయన.. దేశంలో నల్లధనం ఎంత ఉంది? ఎంతమంది దగ్గర ఉందన్నది ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేసిన ఆయన.. బ్యాంకుల వద్ద క్యూలలో ఎవరైనా నల్ల కుబేరులు ఉన్నారా? అని ప్రశ్నించారు. కొంతమంది నల్లధన పెద్దల కోసం సామాన్యుల్ని కష్టాలు పెట్టకూడదన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రయిన్ ప్రసంగం సందర్భంగా మోడీ తీసుకున్న రద్దునిర్ణయంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన ప్రసంగంలో పలుమార్లు తమ పార్టీ అధినేత్రి.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నామని.. తాము చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రయోజనం కోసం కాదని.. ప్రజల ఆగ్రహాన్ని తాము చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించారు.
పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్న ఆయన.. రద్దునిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పినఆయన.. పెద్దనోట్ల రద్దుపై 18 పార్టీలు చెబుతున్నది వారి అభిప్రాయం కాదని.. దేశ ప్రజలదిగా స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు చేసిన పక్షంలోచిల్లర నోట్లకు కష్టు ఎదురవుతాయన్న విషయాన్నిఎందుకు అంచనా వేయలేదని సూటిగా ప్రశ్నించారు. నోట్ల రద్దు విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్న ఆయన.. ఏడాది ముందు నుంచే వంద నోట్లను ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. రూ.2వేల నోట్లతో సామాన్యులకు ఓరిగిందేమీ లేదని మండిపడ్డారు. ఒకరి తర్వాత ఒకరుగా విపక్ష నేతలు.. మోడీ తీసుకున్న రద్దునిర్ణయంపై తీవ్రస్థాయిలోవిరుచుకుపడటం.. తీవ్ర విమర్శలతో సభలో హాట్ హాట్ గా మారిపోయిన పరిస్థితి. మరికొన్ని పార్టీ నేతలు రద్దుపై మాట్లాడాల్సి ఉంది. అనంతరం వారి ప్రసంగాలకు ప్రధాని మోడీ తన సమాదానాన్ని ఇవ్వనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/