బాబు బండారం బయటపెట్టిన మావోల లేఖ

Update: 2018-11-06 05:47 GMT
మావోయిస్టులు ఏపీ సీఎం చంద్రబాబు బండారంపై ఘాటైన లేఖ రాశారు. దాదాపు 5 పేజీల లేఖ ను పాడేరులో మీడియాకు విడుదల చేశారు. అరకు ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు చంపాక వారిపై టీడీపీ నాయకులు తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా-ఒడిశా ఎస్.జడ్.సీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగబంధు ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాసిన లేఖ కలకలం రేపుతోంది. బాబు నక్కజిత్తులను జనం నమ్మరని ఆయన లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం కొనసాగుతున్న గిరిజనుల అక్రమ అరెస్ట్ లు - నిర్బంధకాండకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

+ లేఖలో మావోయిస్టులు పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవీ

*ఏపీలో నిర్బంధ పద్ధతులకు సీఎం చంద్రబాబు చరమగీతం పాడాలి

*బీజేపీకి వ్యతిరేకమంటూ చంద్రబాబు చేస్తున్న నక్కజిత్తులను ప్రజలు నమ్మరు

*ఏజెన్సీలో కూంబింగ్ ల పేరుతో బాబు ప్రజలపై దాడులు చేసి యువకులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు..

*గిరిజనుల ఆస్తులు - ఇళ్లు ధ్వంసం చేస్తున్నారు. రాసరాయి గ్రామంలో 26న అర్ధరాత్రి నలుగురు గిరిజనులను పట్టుకెళ్లిపోయారు. మహిళలను చితకబాదారు

*అక్టోబర్ 15న బూతం అన్నపూర్ణ - సింహాచలం అనే గిరిజనులను అరెస్ట్ చేశారు.

*పోలీస్ అధికారులు గంజాయి వ్యాపారుల నుంచి లంచాలు  తీసుకుంటూ మావోలపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. గంజాయి లంచాల కారణంగానే 2016లో ఏఎస్పీ ఆత్మహత్య చేసుకున్నాడు.

*పోలీసులు చంద్రబాబు ఏజెంట్లు మారి నిజాయితీ - ధైర్యం కోల్పోయారు..

*హుకుంపేట - అనంతగిరి మండలాలు మినహా ఏజెన్సీలోని అన్ని మండలాల్లో అమాయక గిరిజనులను అరెస్ట్ చేశారు.  దీనికి మండలస్థాయి - జిల్లా స్థాయి నాయకులు మూల్యం చెల్లించకతప్పదు.

*చంద్రబాబు కుంభకోణాలపై మావోలు లేఖలో పేర్కొన్నారు.

విశాఖలో భూముల కుంభకోణం.. కాల్ మనీ కుంభకోణాలు ఏమయ్యాయో చెప్పాలని మావోయిస్టు ప్రతినిధి లేఖలో విమర్శించారు. చట్టాలు ఉల్లంఘించి లేటరైట్ - గ్రానైట్ - చైనా క్లే - రంగురాళ్ల తవ్వకాలు జరిపినందుకే కిడారి - సివేరి సోములు మూల్యం చెల్లించుకున్నారని వివరించారు. అక్రమ మైనింగ్ తో వందల కోట్లు సంపాదించుకునేందుకే పార్టీ మారి ఏజెన్సీని దోచుకున్నారని విమర్శించారు.

*సుజానా చౌదరిని ప్రస్తావించిన మావోలు

బ్యాంకులకు వందల కోట్లు ఎగనామం పెట్టిన సుజానా చౌదరి వంటి నేరస్థులను చంద్రబాబు - డీజీపీ కాపాడుతున్నారని మావోయిస్టు ప్రతినిధి లేఖలో విమర్శించారు. ఇసుక - భూదొంగలు - మద్యం మాఫియా గాళ్లకు ఏపీ ప్రభుత్వం రక్షణగా ఉందన్నారు. ఏజెన్సీ దమనకాండపై అన్ని రాజకీయ - స్వచ్ఛంద సంఘాలు నోరు విప్పాలని కోరారు.  అక్టోబర్ 8న పెదబయలు మండలంలో గాయపడిన పోలీసుల విషయాన్ని ఎందుకు దాచారని నిలదీశారు. అక్టోబర్ 29న సీకుపనస గ్రామంలో ప్రజలు నిరసన తెలిపితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలతోనే ప్రజాగ్రహం పెల్లుబుకుతుందని హెచ్చరించారు.
Tags:    

Similar News