మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశించినట్లు కీలకమైన సమాచారం అందింది అని పోలీసులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ సరిహద్దు నుంచి అతడు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోకి ప్రవేశించినట్టు పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన హిడ్మా, చికిత్స కోసం తెలంగాణలోకి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. అయితే, ఇటీవల కన్నుమూసిన అగ్ర నేత ఆర్కే మృతిపై ఆరా తీసేందుకూ హిడ్మా వచ్చి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. హిడ్మా తెలంగాణలోకి వచ్చినట్లు మాకు సమాచారం ఉంది అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని రెండు, మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు ఇప్పటికే సమచారమిచ్చాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని జయశంకర్ , భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఏజెన్సీలోని ఆస్పత్రులను జల్లెడపడుతున్న పోలీసులు, ముమ్మర తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆర్కే మృతిచెందిన సమయంలో హిడ్మాతో పాటు మరికొందరు మావోయిస్ట్ నేతలపై విష ప్రయోగం జరిగిందని సానుభూతిపరులు ఆరోపించారు. తాజా పరిణామాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. తనపై విష ప్రయోగం జరిగిందన్న అనుమానంతో హిడ్మా ఛత్తీస్‌గఢ్‌ను వీడినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలోకి ప్రవేశించిన అతడిని మెరుగైన వైద్యం కోసం వేరేచోటుకు తరలించే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే మావోయిస్ట్ ఉద్యమంలో చేరిన హిడ్మా.. బస్తర్ ప్రాంతంలో ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నారు. పీఎల్‌జీఏ-1 బెటాలియన్ కమాండర్‌గా, ఛత్తీస్ గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కూంబింగ్ సమయంలో భద్రతా బలగాలపై మెరుపు దాడుల్లో హిడ్మా సిద్ధహస్తుడు. ఈ ఏడాది ఏప్రిల్ లో బీజాపూర్ తరెంలో సీఆర్పీఎఫ్ బలగాలు అతడు పన్నిన వ్యూహంలో చిక్కుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 76మంది సీఆర్ పీఎఫ్ జవాన్లను బలిగొన్న 2010 నాటి తడ్‌మెట్ల దాడి, 2013లో జిరామ్‌ఘాట్ దాడి, 2017లో 27 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని హతమార్చిన ఘటనలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు.