ఏపీ అసెంబ్లీలోకి మావోయిస్టుల ఎంట్రీ?

Update: 2017-03-31 06:55 GMT
నవ్యాంధ్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి తొలిసారి అమరావతి వేదికగా సమావేశాలు నిర్వహిస్తున్న శాసనసభలోకి మావోయిస్టులు ప్రవేశించారని... శాసనలాబీల్లోకి వారు వచ్చేవరకు గుర్తించలేపోయారని ప్రభుత్వ, పోలీసు, ఇంటెలిజెన్సు వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో వారు అసలు మావోయిస్టులేనా.. అదే నిజమైతే ఎలా వచ్చారు.. ఎందుకొచ్చారన్న ప్రశ్నలు ముంచెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
ఇటీవల ఏపీ శాసనసభలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. విజిటర్సు పాసులతో వచ్చిన వారు అంతా పరిశీలించారని.. అయితే, నిఘా వర్గాలకు అనుమానం వచ్చి అరెస్టు చేశాయని చెబుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారంతా విశాఖ ఏజెన్సీకి చెందిన మావోయిస్టులన్న ప్రచారం జరుగుతోంది.
    
అదేసమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. అగ్రగోల్డు వ్యవహారంలో ఎటూ తేలకపోవడంతో విశాఖ ఏజెన్సీకి చెందిన కొందరు బాధితులు వచ్చారని.. సందర్శకుల్లా వచ్చి ఏకంగా అసెంబ్లీలో ఆందోళన చేయాలని ప్లాన్ చేశారని చెబుతున్నారు. వారంతా ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలతో వచ్చారని.. అగ్రిగోల్డు సమస్యను సభ దృష్టికి తెచ్చేందుకు గాను సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి కరపత్రాలు విసరాలన్న ప్లానుతో వచ్చారని పోలీసులు చెబుతున్నారు.
    
పోలీసులు, నిఘా వర్గాల ఆందోళన చెందడం బట్టి మాత్రం అదేమీ కాదన్నవారూ ఉన్నారు. వచ్చింది మావోయిస్టులే అన్న వాదన వినిపిస్తోంది. గత శుక్రవారం ఈ సంఘటన జరగ్గా వెంటనే డీజీపీ, ఇంటిలిజెన్సు ఛీఫ్ అక్కడి చేరుకున్నారు. ఆ తరువాత నుంచి వారిని విచారిస్తున్నారు. విశాఖ మన్యంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తరువాత చంద్రబాబుకు హెచ్చరికలు రావడంతో ఇప్పటికే ఆయన భద్రత పోలీసులకు కత్తిమీద సాములా ఉంది. ఇప్పుడు సభలోనికి కూడా మావోయిస్టులు వచ్చారని తెలియగానే అంతటా భయం ఆవరించింది.    

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News