ఏపీ సీఎం చంద్రబాబునాయుడును మావోయిస్టులు ప్రధాన టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆరుసార్లు ఆయన్ను వెంటాడినట్లు ఢిల్లీ నుంచి నిఘా వర్గాలు రాష్ట్రానికి సమాచారం అందించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆరు సార్లు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని ఢిల్లీ పోలీసులు చెప్పడంతో చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయి.
బలెమల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా చనిపోవడంతో చంద్రబాబును మావోయిస్టులు మరింతగా టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు తాము ఏపీ భవన్ అధికారులకు హెచ్చరించామని… అయినా ఏపీ పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఢిల్లీ పోలీసులు లేఖ రాశారట. మావోయిస్టులు పదేపదే రెక్కీ నిర్వహిస్తున్న విషయాన్ని తాము ఎప్పటికప్పుడు ఏపీ అధికారులకు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదంటున్నారు. కాగా మావోయిస్టుల జర్నలిస్టుల తరహాలో వచ్చి దాడి చేసే అవకాశం ఉందని ఢిల్లీ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.
ఇప్పటికే నాలుగు సార్లు హెచ్చరించామని… ఇదే తాము చేసే ఆఖరి హెచ్చరికగా భావించాలని ఢిల్లీ పోలీసులు ఏపీ అధికారులకు స్పష్టం చేశారు. చంద్రబాబుపై ఢిల్లీలో జరగరానిది జరిగితే తమను నిందించవద్దని ఢిల్లీ పోలీసులు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/