భారతీయులకు తెలివితేటలు నేర్పకూడదంట

Update: 2016-01-27 06:38 GMT
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కొద్దిమంది మేధావుల్లో మార్కండేయ కట్జూ ఒకరు. ఒకదశలో ఆయన నోటి వెంట రోజూ ఆసక్తికర వ్యాఖ్య రావటం.. అది మీడియాలో ప్రముఖంగా ఫోకస్ కావటం జరిగేది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన.. పలు అంశాలపై వెనువెంటనే స్పందించేవారు. అలాంటి ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రముఖమైన ఫేస్ బుక్ నుంచి ఆయన గుడ్ బై చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నట్లుండి ఫేస్ బుక్ నుంచి వైదొలగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించే ముందే ఆయన దానికి సమాధానం చెప్పేస్తున్నారు.

తనకున్న తెలివితేటల్ని పంచాలని తాను భావించానని.. అయితే.. అలాంటి ప్రయత్నం కారణంగా తిట్లు.. విమర్శలు వెనక్కి వస్తున్నాయని.. భారతీయులకు ఏదైనా నేర్పించాలని అనుకోవటం తప్పని తేలిపోయిందని తేల్చేశారు. అందుకే.. తాను ఫేస్ బుక్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా పేర్కొన్నారు. మాటలతోనే కాదు.. చేతలతోనూ కట్జూ కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది కదూ.
Tags:    

Similar News