గ్రేటర్ పరిధిలోని ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ జరిపేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణ బృందానికి సరికొత్త అనుభవం ఎదురైంది. తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు క్యూ కట్టారు. అందరి దారి ఒక ఎత్తు అయితే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీరు మాత్రం అందరిలోకి భిన్నంగా మారింది. ఎన్నికల సంఘం అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేసేలా ఆయన ఆధారాలు సమర్పించారు.
తన వాహనంలో పెట్టల కొద్దీ నోటీసుల కట్టల్ని తీసుకొచ్చి షాక్ ఇచ్చారు ఓట్ల తొలగింపునకు సంబంధించి జారీ చేందుకు సిద్ధం చేసిన వేలాది నోటీసు కట్టల్ని ఆయన పెట్టె లతో తీసుకొచ్చి ఎన్నికల సంఘం అధికారుల ముందు పెట్టారు. ఓటర్లకు నోటీసులు జారీ చేయకుండా ఉన్నప్పటికీ.. వీటిని మాత్రం మున్సిపల్ కార్యాలయాల్లో పెట్టేసి ఉంచారని శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా మున్సిపల్ కార్యాలయాల్లో ఉంచేసిన నోటీసు కట్టల్ని తాను సేకరించి తెచ్చినట్లుగా ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించినట్లు పైకి కనిపించని శశిధర్ రెడ్డి ఆధారాలు చూసి ఎన్నికల సంఘం అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
శశిధర్ రెడ్డి తెచ్చిన ఆధారాలతో.. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపు ఏ స్థాయిలో జరిగిందన్న విషయం తెలియజేసేలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేసిందని చెబుతున్నారు. పెట్టల కొద్దీ నోటీసుల్ని చూసిన ఎన్నికల సంఘం అధికారులు.. సదరు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించటంతో పాటు.. ఎందుకు జారీ చేయలేదు? నోటీసుల్లో ఉన్న వారి ఓటు హక్కును తీసేసారా? లేదా? లాంటి ప్రశ్నలతో తెలంగాణ అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఓటర్ల తొలగింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న విషయంపై తిరుగులేని ఆధారాల్ని శశిధర్ రెడ్డి సమర్పించినట్లుగా చెబుతున్నారు. మిగిలిన నేతల తీరుకు.. శశిధర్ రెడ్డి తీరుకు సంబంధమే లేదని.. ఇంత భారీ స్థాయిలో శశిధర్ రెడ్డి నెట్ వర్క్ ఉందా? అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుండటం గమనార్హం.