కాంగ్రెస్ నుంచి మరో సీనియర్ ఔట్ అయ్యాడు. కాంగ్రెస్ లో సీఎం పోస్టును సైతం ఇచ్చిన ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనమైంది. ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిసి కమలం పార్టీలో చేరికకు రంగం సిద్దం చేసుకున్న సీనియర్ నేత తాజాగా అధికారికంగా పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలను కలిశారని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కొద్దిరోజులకే మర్రి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించాడు.
టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని.. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని మర్రి శశిధర్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన ఆక్షేపించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడుతూ వచ్చిందని.. అయినా ఆయన్ను ఆరేళ్ల పాటు కొనసాగించారని.. పార్టీ రాష్ట్ర ఇన్ చార్జీలుగా వ్యవహరించే అందరూ సమన్వయం చేయకుండా.. లోటు పాట్లు వెతకకుండా పీసీసీ చీఫ్ లకు ఏజెంట్లుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ లో డబ్బు ఇచ్చే వాళ్ల మాటే చెల్లుతుందని మర్రి సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని.. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని శశిధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ బాగు కోసం రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇక ఇటీవలే మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని ఆయన వ్యాఖ్యానించడంతో పాటు నిన్న అమిత్ షాతో భేటి కావడంతో పార్టీ వ్యతిరేక చర్యల్లో భాగంగా క్రమశిక్షణ కమిటీ ఆరేళ్ల పాటు మర్రిని సస్పెండ్ చేసింది.
ఇక తాను బీజేపీలో చేరబోతున్నట్టు మర్రి ప్రకటించారు. చివరగా తానే కాదు.. తనతోపాటు మరికొందరు కూడా కాంగ్రెస్ ను వీడుతున్నట్టు ప్రకటించాడు మర్రి శశిధర్ రెడ్డి. అందరూ కలిసి అమిత్ షా లేదా.. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.