పెళ్లి పీటల నుంచి దిగిపోయి.. అతి చిన్న సిల్లీ రీజన్‌తో పెళ్లి క్యాన్సిల్.. చేసేసింది!
పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే.. ఇలాంటి ఘటనలకు బలమైన కారణాలు ఉంటాయనేది తెలిసిందే. ప్రేమలో.. కట్నకానుకలో.. లేదో.. మరేదైనా బలమైన కారణంతోనో.. పీటలపై పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిన సందర్భాలు తెలిసిందే. అయితే.. తాజాగా మాత్రం అత్యంత సిల్లీ రీజన్‌తో ఓ యువతి పెళ్లి పీటలపై నుంచి దిగిపోయింది. పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్లు సెలెక్ట్ చేసిన దుస్తులు నచ్చలేదని ఏకంగా పెళ్లినే రద్దు చేసింది.
పెళ్లి బట్టలు నచ్చలేదని వివాహాన్నే రద్దు చేసింది ఓ యువతి. తనకు ఆ లెహంగా నచ్చలేదని తల్లి చెప్పిన మాటలు విన్న వధువు.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్యలో ఘర్షణ తలెత్తగా పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. హల్ద్వానీలో నివాసముంటున్న ఓ యువతికి, అల్మోరాలో నివాసముంటున్న ఓ యువకుడికి వివాహం నిశ్చయమైంది. ఈ నెలలో పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పనుల్లో భాగంగా యువకుడి తరఫువాళ్లు పెళ్లి కార్డులు సైతం అచ్చు వేయించారు.
అయితే ఇంతలోనే ఇరు వర్గాలకు ఓ విషయమై వాగ్వాదం మొదలైంది. పెళ్లి కూతురి కోసం వరుడి తండ్రి లఖ్‌నవూ నుంచి ఓ ఖరీదైన లెహంగాను ఆర్డర్ చేశారు. పెళ్లికి ముందు ఆమెకు అందించారు. అయితే ఆ లెహంగాను చూసిన యువతి తనకు నచ్చలేదని తేల్చి చెప్పింది. ఇదే మాట తన తల్లి సైతం చెప్పడం వల్ల ఈ మాట అబ్బాయి ఇంట్లో తెలిసింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ససేమిరా ఈ పెళ్లి జరిగేది లేదంటూ ఇరు వర్గాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. అలా అక్టోబర్30న యువకుడి బంధువులు యువతి ఇంటికి చేరుకుని లక్ష రూపాయల నగదు ఇచ్చి వివాహ రద్దు ఒప్పందానికి వచ్చారు. డబ్బులు ఇచ్చిన్నట్లు రుజువుగా ఓ వీడియోను సైతం తీసుకున్నారు.
ఒప్పందంతో ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది అనుకునేలోపే సీన్ రివర్స్ అయ్యింది. ఏ ఇంటి వారు పెళ్లి వద్దనుకున్నారో.. వారే మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకుని యువకుడి ఇంటికి చేరుకున్నారు. దీంతో మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ విషయం ఇక తేలదని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి ఇరువర్గాలు. అక్కడకు వెళ్లి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. ఆఖరికి పోలీసులు సర్దిచెప్పగా ఇక పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు నిర్ణయించుకున్నారు.