సంచలనం సృష్టించిన మిర్యాలగూడం పరువుహత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. తమకంటే తక్కువ కులం వాడిని తన కూతురు పెళ్లి చేసుకుందున్న కోపంతో.. కుమార్తె భర్తను చంపించిన వ్యాపారవేత్త మారుతీరావు వ్యవహారం ఇప్పుడు సంచలమైంది. తన మాటకు భిన్నంగా.. తన పరువును దెబ్బ తీసేలా కుమార్తె వ్యవహరించటాన్ని జీర్ణించుకోలేని మారుతిరావు.. తన కూతుర్ని పెళ్లి చేసుకున్నోడు ఎట్టి పరిస్థితుల్లో బతక్కూడదని పలుమార్లు హత్యకు ప్లాన్ చేసిన వైనం బయటకు వచ్చింది.
ఈ మొత్తం దుర్మార్గంలో ఊహించని ట్విస్ట్ ఏమంటే.. తన కుమార్తెను పెళ్లి చేసుకున్న ప్రణయ్ ను చంపే డీల్ ను కుదుర్చుకున్నది ఎవరితోనో తెలుసా? గతంలో ఒక భూవివాదం విషయంలో తనను కిడ్నాప్ చేసిన మాజీ ఉగ్రవాదితో. ప్రస్తుతం కోర్టులో దీనికి సంబంధించిన వివాదం నడుస్తోంది. తన పరువును దారుణంగా దెబ్బ తీశారని ఉడికిపోతున్న మారుతిరావు.. మాజీ ఉగ్రవాదితో కోటి రూపాయిల డీల్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
హత్యకు ముందే ప్లాన్ చేసి.. బయటకు మాత్రం ఏమీ తెలీనివాడిగా వ్యవహరిస్తూ.. చివరి వరకూ ఎంతో మంచిగా ఉన్నట్లు నటించిన ఆయన.. కూతురు ద్వారానే ఆమెకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ప్రణయ్ ను పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు తనకు పరిచయం ఉన్న రాజకీయ నాయకుల్ని.. పోలీసు అధికారుల్ని పలుమార్లు ప్రయోగించినా.. అలాంటి ప్రయత్నాలు ఫలించకపోవటంతో.. కిరాయి మూకతో చంపాలని డిసైడ్ అయ్యాడు. అయితే.. గతంలో రెండుసార్లు హత్యకు ప్లాన్ చేసినా.. అవి కాస్తా పొక్కి ఫెయిల్ కావటంతో.. ఈసారి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మాజీ ఉగ్రవాదితో కోటికి డీల్ చేసినట్లుగా చెబుతున్నారు.
గతంలో తనను కిడ్నాప్ చేసిన ఉదంతంపై కోర్టులో కేసు నడుస్తున్న నిందితుడితోనే డీల్ చేసుకొని.. తన కూతురు పెళ్లి చేసుకున్న ప్రణయ్ ను అంతమొందించేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా తన కుమార్తెకు ఎలాంటి హాని తలపెట్టొద్దని కోరినట్లుగా చెబుతున్నారు. హత్యకు ప్లాన్ చేసిన మారుతీరావుతో పాటు.. హత్య చేసిన నిందితులు సైతం ప్రస్తుతం పోలీసుల అదుపులోఉన్నట్లుగా తెలుస్తోంది. తన భర్త హత్యకు కారణమైన వారిని ఉరి తీయాలంటున్న అమృత.. తన తండ్రికి సైతం మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తుంది. కూతురు పెళ్లి చేసుకున్నోడిని హత్య చేస్తే.. తన ఇంటికే వస్తుందన్న భావనతో మారుతిరావు మర్డర్ ప్లాన్ చేయటంపై అమృత స్పందిస్తూ.. తన జీవితంలో తన తండ్రి వద్దకు వెళ్లే అవకాశమే లేదని తేల్చి చెబుతోంది. తాను చచ్చినా తన తండ్రి దగ్గరకు వెళ్లేదే లేదని తెగేసి చెబుతోంది.