వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. గేల్ క్రీజులో నిలబడి స్టేడియంలో సిక్సర్ల మోత మోగిస్తుంటే మ్యాచ్ చూస్తున్న అభిమానులకు పండగే. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే ఈ స్టార్ క్రికెటర్ తన ఆటతీరుతోనే కాకుండా, తన ప్రవర్తనతో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. గతంలో బిగ్ బాష్ మ్యాచ్ సందర్భంగా ఓ యాంకర్ తో అసభ్యంగా ప్రవర్తించాడని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనతో డ్రింక్ కు వెళ్దామని ఆ యాంకర్ ను గేల్ లైవ్ లో అడిగాడు. ఆ వీడియో పెను దుమారం రేపడంతో గేల్ మీడియాముందు బహిరంగ క్షమాపణ చెప్పాడు. అదే తరహాలో, ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచకప్ సందర్భంగా విండీస్ కు మసాజ్ థెరపిస్టుగా పనిచేసిన లీన్ రసెల్ తో గేల్ అసభ్యంగా ప్రవర్తించాడట. డ్రెస్సింగ్ రూమ్ లో గేల్ ఆమెకు మర్మాంగాన్ని చూపించాడని గత జనవరిలో ఫెయిర్ ఫాక్స్ మీడియా వార్తా పత్రికలైన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ - ది ఏజ్ - ది కాన్ బెర్రా టైమ్స్ కథనాలు వెలువడ్డాయి. అయితే, ఆ కథనాలను గేల్ ఖండించాడు. ఆ సమయంలో గేల్ పక్కనే ఉన్న డ్వేన్ స్మిత్ కూడా ఆ కథనాలను ఖండించాడు. తన పేరు ప్రతిష్ఠలను మసకబార్చాలని ఆ పత్రికలు చూస్తున్నాయని గేల్ పరువునష్టం దావా వేశాడు. ప్రస్తుతం సిడ్నీ కోర్టులో ఆ కేసు విచారణ సందర్భంగా రసెల్ మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఆ రోజు గేల్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని రసెల్... కోర్టుకు తెలిపింది. గేల్ తనకు మర్మాంగాన్ని చూపడంతో చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చానని రసెల్.... సిడ్నీ కోర్టుకు తెలిపింది. ఆ తర్వాత తాను ఎంతో వేదనకు గురయ్యానని పేర్కొంది. ‘ఆ రోజు టవల్ కోసం నేను ఛేంజింగ్ రూమ్ కు వెళ్లాను. అప్పుడు గేల్ నా వద్దకు వచ్చాడు. ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. టవల్ కోసమని చెప్పాను. అప్పుడాయన నడుముకు చుట్టుకున్న టవల్‌ను విప్పేసి కిందపడేశాడు. ఆయన మర్మాంగాన్ని చూసిన నేను దృష్టి మరల్చుకొని క్షమాపణలు చెప్పి బయటకు వచ్చేశాను. ఈ విషయాన్ని వెంటనే విండీస్ ఫిజియో థెరిపిస్టుకు చెప్పాను. చెప్పలేనంత బాధపడ్డాను. చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేశాను’ అని రసెల్.... కోర్టుకు చెప్పినట్టు సిడ్నీ హెరాల్డ్ పత్రిక తెలిపింది. అయితే, గేల్ ఘటన కన్నా ముందు మసాజ్ చేయించుకున్న స్మిత్.... రసెల్ కు ‘సెక్సీ’ అని సందేశం పంపానని మంగళవారం ఒప్పుకొన్నాడు. ఈ కేసు విచారణ పది రోజుల పాటు జరగనుంది.