అయోధ్య టార్గెట్ గా భారీ ఉగ్ర కుట్ర !

Update: 2019-12-26 08:08 GMT
అయోధ్య లో ఉగ్ర దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌ కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు భారత నిఘా వర్గాలు పసి గట్టాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ భారత్‌ లో ఉన్న తమ ఉగ్రవాదులకు టెలిగ్రామ్ చాటింగ్ యాప్‌ లో పంపించిన సందేశాన్ని దానిని భారత నిఘావర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది. మౌలానా మసూద్ అజార్ పంపించిన ఆ సందేశాన్ని డీకోడ్ చేసిన ఇంటెలీజెన్స్, నిషేధిత ఉగ్రవాద సంస్థ అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రపన్నుతున్నట్టు గ్రహించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖతోపాటు అన్ని భద్రతా బలగాల విభాగాలకు తెలియజేసి , అందరిని అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించాయి.

నిఘావర్గాల హెచ్చరికల తో భారత్‌ లోని జైషే మహమ్మద్ నెట్‌ వర్క్‌ పై ఓ కన్నేసిన భద్రతా బలగాలు.. అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. అయోధ్య లో రద్దీ గా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దశాబ్ధాల తరబడి గా పరిష్కారం కాకుండా ఉన్న అయోధ్య వివాదంలో ఇటీవలే సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదంలో ఉన్న అయోధ్య స్థలం లో రామ మందిరం నిర్మించాలని స్పష్టంచేసిన సుప్రీం కోర్టు, అదే సమయంలో మరో ఐదు ఎకరాల భూమిని ముస్లిం సంస్థకు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై పలు ముస్లిం మత సంస్థల పెద్దలు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలోనే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సైతం అయోధ్య తీర్పున కు నిరసనగా అయోధ్య లో ఉగ్రదాడి కి పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్‌ లో దాడులకు పాల్పడటం ఇదేం కొత్త కాదు. 2001లో భారత పార్లమెంట్‌ పై ఉగ్రదాడికి పాల్పడం నుంచి మొదలుపెడితే.. ఇదే ఏడాది ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ పై ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సైనికుల ప్రాణాలని గాల్లో కలిపేసింది. అలాగే ఈ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఎన్నో అరాచకాలకు పాల్పడింది. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం మసూద్ అజార్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టుగా మే 1న యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News