తెలుగు రాష్ర్టాలే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఇంకా అప్‌డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఒకింత స్తబ్దుగా మారిన ఈ కేసులో తాజాగా మరో అప్ డేట్ వచ్చి చేరింది. ఓటుకు నోటు కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ నిందితుడు జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.
మత్తయ్య క్వాష్ పిటిషన్ పై విచారణ తాజా సందర్భంగా ఏసీబీ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మత్తయ్య వేసిన పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని ఏసీబీ తరపు న్యాయవాదులు వాదించారు. ఆయనపై ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశామని అందుకే మత్తయ్య క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఈక్రమంలో కౌంటర్ దాఖలు చేయడానికి మత్తయ్య తరపు న్యాయవాదులు గడువు కావాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.