బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయవతికి ఊహించని షాక్ తగిలింది. విగ్రహాల పేరుతో ఆమె తీసుకున్న నిర్ణయం తాజాగా ఆమె మెడకు చుట్టుకుంది. విగ్రహాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు మండిపడింది. విగ్రహాల ఏర్పాటు కోసం చేసిన మొత్తం ఖర్చును తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని బీఎస్సీ నేత మాయావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్లను ఏప్రిల్ 2వ తేదీన విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే...2007-12 కాలంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ - పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాల నిర్మాణం చేపట్టారు. ఇందుకు ప్రభుత్వ ఖజానాను వాడారన్నది ఆరోపణ. లక్నో - నొయిడాతో పాటు యూపీలో పలు చోట్ల స్మారక మందిరాలను మాయావతి నిర్మించారు. వాటిలో భారీ ఏనుగు (మాయావతి పార్టీ ఎన్నికల గుర్తు) విగ్రహాలతో పాటు పలు పార్కులను కూడా నిర్మించారు. వీటి కోసం రూ. 2600 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. రూ.1,400 కోట్లు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున్నే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విగ్రహాల పర్వంలో - కొందరు ప్రభుత్వాధికారులు - ప్రైవేట్ వ్యక్తులు లాభపడ్డారని ఉత్తరప్రదేశ్ విజిలెన్స్ కమిషన్లో ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఇప్పటికే దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లక్నోలో కొందరు అధికారులు - ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో ఒకేసారి ఏడుచోట్ల తనిఖీలు జరిపారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు స్మారకాల నిర్మాణ కుంభకోణాన్ని ఈడీ తవ్వడం ప్రారంభించింది.
ఇదిలాఉండగా, సుప్రీంకోర్టులోనూ విగ్రహాల స్కాంపై పిటిషన్ దాఖలైంది.రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రజాధనం ఖర్చు చేయకుండా మాయావతిని నియంత్రించాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు విచారణ జరిపింది. తన హయాంలో నిర్మించిన స్మారక మందిరాల ఖర్చును వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని యూపీ మాజీ సీఎం, బహుజన సమాజ్ వాదీ పార్టీ నేత మాయావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది తాత్కాలిక ఆదేశాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.