మొదట విదేశీ బ్యాంకులు వెళ్లిపోయాయి. తర్వాత విదేశీ వ్యాపార, వాణిజ్య సంస్థలు వెళ్లిపోయాయి.. ఇప్పుడు విదేశీ ఆహార సంస్థల వంతు.. ఇదీ ప్రస్తుతం రష్యాలో పరిస్థితి. తాజాగా రష్యా నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ ప్రకంటించింది. అమెరికాలోని చికాగో కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కారణంగా తలెత్తిన మానవతా సంక్షోభాన్ని కారణంగా చూపుతూ రష్యాను వీడాలని నిర్ణయించింది.
రష్యాలో తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ సోవియట్ యూనియన్ పతనానికి కొద్దిగా ముందు అంటే.. 1990లో మెక్ డొనాల్డ్స్ రష్యాలోఅడుగుపెట్టింది. సోవియట్ యూనియన్‌లో తొలి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఇదే కావడం విశేషం. మాస్కోలోని పుష్కిన్ స్క్వేర్ వద్ద మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ప్రారంభం రోజునే రికార్డులు బద్దలు కొట్టింది. మూడు రూబుళ్లలో లభించే బిగ్ మ్యాక్ కోసం 30 వేల మంది గుమిగూడారు. అప్పటి నుంచి రెస్టారెంట్లు, ప్రాంచైజీ రెస్టారెంట్ల రూపంలో దేశవ్యాప్తంగా విస్తరించింది.
ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా.. ఇప్పుడు 850 రెస్టారెంట్ల(84 శాతం వాటా)ను స్థానిక వ్యక్తులకు అమ్మేస్తోంది. ఈ సమయంలో ప్రాంఛైజీల భవిష్యత్తు మాత్రం అస్పష్టంగా ఉంది. అలాగే కొత్త యజమానులు సంస్థ పేరు లోగో, బ్రాండింగ్, మెనూను వాడేందుకు అనుమతి లేదు. అయితే మెక్‌డొనాల్డ్స్ రష్యాలో తిరిగి వచ్చే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. తమ సిబ్బందిని రష్యా కొనుగోలుదారు నియమించుకోవాల్సి ఉంటుందని.. విక్రయం పూర్తయ్యేవరకు వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుందని సోమవారం సంస్థ స్పష్టం చేసింది.
సిబ్బందికి సంస్థ లేఖ..రష్యాలో వ్యాపారాన్ని కొనసాగించడం ఇక ఏ మాత్రం సమర్థనీయం కాదు. అది మెక్‌డొనాల్డ్స్ విలువలకు ఏ మాత్రం సరిపోదు అక్కడ పనిచేస్తున్న అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ ప్రెసిడెంట్ తన సిబ్బందికి ఇటీవల లేఖ పంపారు. 'ఆహారాన్ని అందుబాటులో ఉంచడం, వేల సంఖ్యలో సాధారణ పౌరులకు ఉపాధిని కొనసాగించడం కచ్చితంగా సరైన పని అని కొందరు వాదించొచ్చు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని విస్మరించడం అసాధ్యం 'అని పేర్కొన్నారు. మెక్ డొనాల్డ్స్ రష్యాను వీడటం బర్గర్ ప్రేమికులను తీవ్రంగా బాధిస్తోంది.మెక్‌డొనాల్డ్స్ రుచులు మళ్లీ ఎప్పుడు చూస్తామోననుకుంటూ.. అక్కడక్కడా తెరిచి ఉన్న రెస్టారెంట్ల వద్ద జనాలు క్యూ కట్టారు.'మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్లు కొన్ని చోట్ల మాత్రమే తెరిచి ఉన్నాయి. నేను ఈ ఫుడ్‌ను మిస్ అవుతాను.
అందుకే బిగ్ మ్యాక్‌తో సెలబ్రేట్ చేసుకుంటాను' అంటూ 32 ఏళ్ల ఇరినా వెల్లడించారు.'త్వరలో మెక్‌డొనాల్డ్స్‌ను మూసివేస్తారని నిన్న చదివాను. కొత్త పేరుతో దానిని ప్రారంభిస్తారని తెలిసింది. అందుకే నా ఫేవరెట్ చీజ్ బర్గర్, మిల్క్ షేక్, చిప్స్ తీసుకునేందుకు వెంటనే ఇక్కడికి వచ్చేశాను.
సంస్థ చేతులు మారిన తర్వాత నాణ్యత ఎలా ఉటుందో ఏమో..?'అంటూ 21 ఏళ్ల అల్లా చెప్పారు. సైబీరియా ప్రాంతంలో కొన్ని ప్రాంఛైజీ తరహా అవుట్‌లెట్లు తెరిచి ఉన్నాయి. ఆ విషయం తెలుసుకున్న సమారా ప్రాంతానికి చెందిన వ్యక్తి.. రెండున్నర గంటల పాటు 250 కిలోమీటర్లు ప్రయాణించారు. రానున్న రోజుల్లో రష్యన్లు ఈ ఫుడ్‌ను ఎంతగా మిస్ అవుతారో ఈ ఉదాహరణలు బట్టే తెలుస్తోంది. అందుబాటు ధరలో, అనుకున్న వెంటనే తినే వీలున్న ఈ రెడీమెడ్ ఆహారం కొద్ది సంవత్సరాలుగా రష్యన్లకు బాగా దగ్గరైపోయింది మెక్ డొనాల్డ్స్.