ట్రెండింగ్‌లో మూన్‌లైటింగ్, క్వైట్ క్విటింగ్.. ఈ కార్పొరేట్ పదాలకు అర్థాలు ఇవే!
ఐటీ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న కొన్ని పదాలు.. మూన్‌లైటింగ్, క్వైట్ క్విట్టింగ్. తాజాగా ఐటీ దిగ్గజం.. ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగులు మూన్‌లైటింగ్ (ఏకకాలంలో రెండు ఉద్యోగాలు) చేయడం కుదరదని పేర్కొనడంతో ఈ మూన్‌లైటింగ్ అంటే ఏమిటని అంతా డిక్షనరీల ముందు కూర్చున్నారు. అలాగే మరికొన్ని కార్పొరేట్ పదాలకు కూడా అర్థాలు తెలియక గందరగోళంలో ఉన్నారు. ఇటీవల కాలంలో కార్పొరేట్ పారిభాషిక పదాలుగా చెలామణి అవుతున్నవాటికి అర్థాలు ఇవే...
మూన్‌లైటింగ్.. అనేది అమెరికాలో చలామణిలోకి వచ్చింది. అక్కడ కొందరు ఉద్యోగులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసి.. ఆ తర్వాత అదనపు ఆదాయం కోసం సాయంత్రం వేరే జాబ్ చేస్తున్నారు. అంటే రాత్రిపూట పనిచేస్తున్నారు. దీంతో మూన్‌లైటింగ్ (చంద్రుడి కాంతి)లో రాత్రిపూట పనిచేస్తున్నారు కాబట్టి ఇలా రెండు ఉద్యోగాలకు చేసేవారికి మూన్‌లైటింగ్ అనే పదం వ్యాప్తిలోకి వచ్చింది.
క్వైట్ క్విటింగ్ అంటే నెమ్మదిగా వదిలేయడం లేదా తప్పుకోవడం. అయితే కార్పొరేట్ పరిభాషలో దీనికి ప్రత్యేక అర్థం ఉందని అంటున్నారు. క్వైట్ కిట్టింగ్ అంటే.. పని భారాన్ని తగ్గించుకోవడం. కేవలం తమ పని ఎంత వరకో అంతవరకు మాత్రమే పరిమితం కావడం. ఈ నేపథ్యంలో ఉద్యోగులు అదనపు భారాన్ని లేదా అవసరమైన దానికంటే ఎక్కువ పని భారాన్ని మోయడానికి సిద్ధంగా లేరని చెబుతున్నారు.
ది గ్రేట్ రిజిగ్నేషన్.. మంచి జీతభత్యాలు, పే ప్యాకేజీలు ఇస్తామని ప్రస్తుతం ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలు ప్రకటిస్తున్నా వాటిలో ఉండకుండా ఉద్యోగులు వేరే జాబ్స్ వెతుక్కోవడాన్ని 'ది గ్రేట్ రిజిగ్నేషన్'గా చెబుతున్నారు.
నీ డీప్.. ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నామనే అర్థంలో నీ డీప్ అనే పదాన్ని వాడుతున్నారు.
బైట్ ద బుల్లెట్.. కష్టమైన టాస్క్‌ను తీసుకోవాలని ఉద్యోగులకు బాస్ లేదా మేనేజర్లు చెప్పాలనుకున్నప్పుడు బైట్ ద బుల్లెట్ పదాన్ని వినియోగిస్తున్నారు.
హ్యాంగింగ్ ఫ్రూట్.. ఏదైనా లక్ష్యాన్ని, పనిని సులువుగా చేయొచ్చన్న ఉద్దేశంలో హ్యాంగింగ్ ఫ్రూట్ అనే పదాన్ని వాడుతున్నారు.
కోర్ కాంపిటెన్సీ.. ఒక వ్యక్తి లేదా కంపెనీ ప్రధాన సామర్థ్యం ఇదీ అని చెప్పే ఉద్దేశంలో కోర్ కాంపిటెన్సీ అనే పదాన్ని వాడుతున్నారు.
డ్రిల్ డౌన్.. ఏదైనా విషయంలో మరింత లోతుల్లోకి వెళ్లాలనుకున్న సందర్భంలో డ్రిల్ డౌన్ పదాన్ని వినియోగిస్తున్నారు.
గివ్ 110%.. ఎవరైనా నూటికి నూరు శాతం కష్టపడు లేదా నూటికి నూరు శాతం ఆ పని నువ్వు చేయాలి అని అంటారు. అయితే కార్పొరేట్ పరిభాషలో ఒక పని మీద ఇంకా అదనంగా దృష్టి కేంద్రీకరించాలని బాస్.. ఉద్యోగులకు చెప్పాలనుకున్న సందర్భంలో గివ్ 110% వినియోగిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.