వైసీపీకి మీడియా అంటే భయమా.. మరి ! ఆ రోజు పదవిలో లేనప్పుడు ఏమున్నా మీడియా కు చెప్పాలన్న ఆరాటం ఉండేదే ? కానీ ఇప్పుడు ఏమున్నా మేం చెప్తాం అదే మీరు రాసుకోండి.. అంతేకానీ మేం చెప్పకుండా ఈ హాల్లోకి రావడానికే లేదు అని ఎలా హుకుం జారీ చేస్తారో మరి !
ఇదంతా తూగో వాకిట జరిగిన రగడ. ఇంత జరిగినా ఒకనాటి ఈనాడు కరస్పాండెంట్ ప్రస్తుత వైసీపీ ప్రముఖుడు కురసాల కన్నబాబు ఏం మాట్లాడక పోగా, ద్వారంపూడికి వత్తాసు పలికిన తీరు విమర్శలకు తావిస్తోంది. అంటే ఇకపై ఏ అధికారిక కార్యక్రమం ఉన్నా మీడియాకు బైట్ ఒకటి ఇస్తారు.
లేదంటే ఫొటో ఒకటి ఇస్తారు. లేదంటే సమావేశం ఆరంభంలో సజెషన్ షాట్ ఒకటి తీసుకుని వెళ్లిపోవాలి.. ఇవే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ చెబుతున్న మాటలు. మరి ! ఆ రోజు ఏం చెప్పారు.. ఎలా ఉన్నారు.. అంతా పారదర్శకంగానే పోతున్నాం అని సీఎం జగన్ ఏవిధంగా ఇప్పుడు చెప్పగలరని అని అంటోంది టీడీపీ.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ మళ్లీ రెచ్చిపోయాడు. మీడియాకు నో ఎంట్రీ చెప్పి, పత్రికలపై, ఇతర మాధ్యమాలపై తనకు ఉన్న అక్కసునంతా వెళ్లగక్కారు. నిన్నమొన్నటి వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మీడియా ప్రతినిధులు రాకుండా బాగానే అడ్డుకుని సఫలీకృతం అయ్యారు.
ఆ విధంగా ఆయనకు మరో మాజీ జర్నలిస్టు మరియు మాజీ మంత్రి కురసాల కన్నబాబు వత్తాసు పలికారు. మీడియా వస్తే వాళ్లను చూసి విపక్షం రెచ్చిపోతోందని, దీంతో వాళ్లు తీసిన వీడియోలు తెగ వైరల్ అవుతూ తమ పరువు తీస్తున్నాయి అన్న ఉద్దేశంతో ద్వారంపూడి చెప్పకనే చెప్పిన మాటల అర్థం, భావం, అన్వయం అన్నీ ఇదే విషయాన్ని సుస్పష్ట రీతిలో చాటుతున్నాయి.
తాను ఇప్పటికే కాకినాడ నగర కార్పొరేషన్ మీటింగ్ లకు కూడా మీడియాను రానివ్వడం లేదని, ఇదే పద్ధతి జెడ్పీకి కూడా ఎప్లై చేద్దామని అన్నారు. ఇదే సందర్భాన ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న సీదిరి అప్పల్రాజు సైతం ఈ విషయమై ఏమీ మాట్లాడలేదు అని కూడా తెలుస్తోంది.