తెలంగాణలో లాక్ డౌన్ మే 7 వరకు సీఎం కేసీఆర్ పొడిగించారు. కేంద్రం ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చినా తెలంగాణలో కుదరదని తేల్చిచెప్పారు. అయితే కేసీఆర్ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తూ శభాష్ అంటున్నా.. మీడియా రంగం మాత్రం కుదేలు అవుతోందన్న చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ ముఖ్యంగా పత్రికలను, న్యూస్ చానెళ్లను దెబ్బ తీసేందుకే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ పొడిగించారని ఆయా మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
లాక్ డౌన్ తో యాడ్స్, ప్రభుత్వ ప్రకటనలు లేక ప్రధానంగా పత్రికలు జిల్లా సంచికలను ఎత్తివేశాయి. మెయిన్ లోనే కలిపికొడుతున్నాయి. జర్నలిస్టులను తీసేసి ఇంట్లో కూర్చుండబెట్టాయి. మళ్లీ పునరుద్దరిస్తేనే తీసుకుంటామని లేదంటే లేదని.. పట్టుమని 10 మందితో నడిపిస్తున్నాయి.
ప్రధానపత్రికల వద్ద ప్రస్తుతానికి న్యూస్ ప్రింట్ మరో 10-20 రోజులు మాత్రమే ఉంది.అది అయిపోతే పత్రికల ప్రింటింగ్ ఆగిపోతుంది. మొత్తం పత్రికలే మూతపడుతాయి. న్యూస్ ప్రింట్ రష్యా దేశం నుంచి రావాలి. అక్కడా లాక్ డౌన్. కేంద్రం సడలించినా తెలంగాణలో కేసీఆర్ సడలించలేదు. సో మే 7వరకు ఎక్కడి నుంచి తెప్పించుకోలేం. ఇక కలర్స్ ముంబై నుంచి రావాలి. అక్కడ తీవ్రంగా లాక్ డౌన్. పత్రికల మనుగడకు అవసరమైన న్యూస్ ప్రింట్, కలర్స్ తెలంగాణకు రావడం కష్టమే. ఇప్పుడున్నవి అయిపోతే పత్రికల ముద్రణ మొత్తం ఆగిపోతుంది. కేసీఆర్ లాక్డౌన్ పొడిగిస్తే పత్రికలకు కష్టకాలమే..
ఇక లాక్ డౌన్ వల్ల పత్రికలే కాదు.. న్యూస్ చానెల్స్ కూడా చాలా మందిని తీసేసాయి. దానివల్ల ఆయా మీడియా రంగాలు దెబ్బతిన్నాయి. ఇటు పత్రికలు, న్యూస్ చానెల్స్ మానవ వనరులు కోల్పోయి కుదేలయ్యాయి. కేసీఆర్ లాక్ డౌన్ వ్యూహాత్మకంగా పొడిగిస్తే వాటి మనుగడ మరింత కష్టం.
అయితే కేసీఆర్.. కరోనా పేరుతో లాక్ డౌన్ మంచిదే అయినా ముఖ్యంగా మీడియా దీని దెబ్బకు కుదేలు కావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎందుకంటే కేసీఆర్ సొంతపత్రికలో న్యూస్ ప్రింట్ రెండు నెలలకు సరిపడా ఉందట.. ప్రధాన రెండు పత్రికల వద్ద అంతలేదట.. సో కేసీఆర్ లాక్ డౌన్ పొడిగింపు వల్ల ప్రధానంగా నష్టపోయేది ఆ రెండు పత్రికలు, న్యూస్ చానెల్స్ అంటున్నారు. సో పరోక్షంగానైనా కేసీఆర్ తనకు కొరకరాని కొయ్యగా ఉన్న మీడియాను లాక్ డౌన్ తో నియంత్రిస్తున్నారన్నర చర్చ ప్రస్తుతం తెలంగాణ జర్నలిస్టు వర్గాల్లో సాగుతోంది.