వైద్య‌విద్యార్థి ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ ప్లాంట్‌

Update: 2016-06-07 10:55 GMT
వైద్యసేవ‌ల్లో ఎంత పురోగ‌తి వ‌స్తుందో వాటిపై స‌రైన అవ‌గాహ‌న లేకుండా ఆ ప్ర‌క్రియ‌లపై ఆస‌క్తిక చూపించే ఇక్క‌ట్ల పాల‌వుతున్నవారికి ఇదో తాజా ఉదాహ‌ర‌ణ‌. వెంట్రుకలు మొలిపించుకునేందుకు చేయించుకున్న ఆప‌రేష‌న్ ఆయ‌న ప్రాణాల‌కే ముప్పు తెచ్చింది. పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులో జ‌రిగింది ఈ ఘ‌ట‌న‌.

తమిళనాడులోని ఆర్నీకి చెందిన మద్రాస్ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి చదువుకుంటున్నాడు. త‌నకు ఉన్న బ‌ట్ట‌త‌ల ప‌రిష్కారం కోసం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్ మెంట్ స‌రైన మార్గంగా ఆయ‌న భావించాడు. ఇందుకోసం నున్గాబక్కమ్ లోని  ఓ సెలూన్ ను సంప్రదించాడు. గత నెల 17న వాళ్లు ట్రీట్ మెంట్ చేశారు అయితే సరైన విధంగా మ‌త్తుమందు ఇవ్వలేదు. దీంతో స‌ద‌రు వైద్య విద్యార్థి ఆపరేషన్ వికటించి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు.దీంతో స్థానికంగా వైద్య చికిత్స చేయించుకున్నాడు. అయితే మళ్లీ స‌మ‌స్య‌ల పాలవ్వడంతో క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వైద్య‌స‌హాయం తీసుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ వైద్య‌విద్యార్థి ఆస్ప‌త్రిలోనే చనిపోయాడు. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు కానీ, పోస్టుమార్టం కానీ జరగకుండానే విద్యార్థి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు జరిపేశారు.

ఆ త‌ర్వాతే ట్విస్ట్ మొద‌ల‌యింది. ఓ వారం గ‌డిచిన‌ తర్వాత విద్యార్థి మృతిపై స‌హ‌చ‌రుల ద్వారా సమాచారం అందుకున్న డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దీనిపై విచారణ జరిపింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. అక్కడి క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అనస్తీషియా సరిగ్గా ఇవ్వక పోవడం వల్ల.. అలర్జీ సోకడంతో విద్యార్థి చనిపోయాడ‌ని తేలింది. దీంతో డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స‌ద‌రు సెలూన్‌ ను సీజ్ చేసి స‌ర్జరీ చేసిన డాక్టర్లు హరిప్రసాద్ - వినీత్ లకు నోటీసులు జారీచేసింది. వీరిలో హరిప్రసాద్ అనస్తీటిస్ట్ కాగా.. వినీత్ చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. అయితే విచారణలో వీరిద్దరూ సర్జరీ చేయదగిన వారు కారని తేల్చింది. ఈ కేసును రాష్ట్ర వైద్యమండలికి విచార‌ణ చేస్తోంది.
Tags:    

Similar News