అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓపక్క ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు దీక్ష చేస్తున్న వేళ.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న రాత్రి నుంచి వరుస ట్వీట్లతో ఏపీ సీఎం బాబుపైనా.. ఆయన కుమారుడిపైనా.. కొన్ని ప్రముఖ మీడియా సంస్థల యజమానులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశారు.
తన ట్వీట్లతో భారీ సంచలనానికి తెర తీసిన ఆయన.. తన తల్లిని అవమానించిన వైనంపై తీవ్ర ఆగ్రహంతో పాటు.. ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని రీతిలో ట్వీట్లు చేసిన పవన్.. ప్రముఖ మీడియా సంస్థల అధిపతుల కుటుంబాలపైనా కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
తనకు వ్యతిరేకంగా గడిచిన కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని.. ఇందులో బాబు డ్రీమ్ టీం పని చేస్తుందని పవన్ ఆరోపించారు. తనకు జరుగుతున్న కుట్రల్ని ఖండించిన పవన్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఉదయం ఫిలింఛాంబర్ వద్దకు చేరుకున్న పవన్.. అక్కడ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.
పవన్ రాకతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఫిలిం ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. పవన్ చేసిన ట్వీట్ల నేపథ్యంలో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ ను బద్నాం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. ఫిలింఛాంబర్లో చర్చలు జరుపుతున్న పవన్.. బయటకు వచ్చి ఏం చెబుతాడా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
మరోవైపు.. ఫిలింఛాంబర్ కు పవన్ వచ్చిన తర్వాత నాగబాబు.. అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్ తో సహా పలువురు మెగా నటులు మా కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే రామ్ చరణ్ కూడా మా ఛాంబర్ కు చేరుకున్నారు
మరోవైపు.. మాకు కాసేపట్లో చిరంజీవి కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. పవన్ కు బాసటగా పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతును ప్రకటిస్తున్నారు.