వైన్ షాపులు తెరవండి.. సీఎంకు బీజేపీ అధ్యక్షుడి లేఖ

Update: 2020-04-04 10:10 GMT
లాక్ డౌన్ తో సర్వం బంద్ అయిపోయింది. వ్యాపార - వాణిజ్యాలు అన్నీ మూసుకుపోయాయి. తెలుగు రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ లో పడిపోయాయి. జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే మందుబాబులు ఆగమాగం అవుతున్నారు. పిచ్చిపట్టి ఆస్పత్రుల పాలవుతున్నారు. 

తాజాగా హైదరాబాద్ - నిజామాబాద్ లలో మందుబాబులు మందు దొరక్క ఆస్పత్రుల పాలయ్యారు. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి - నిజామాబాద్ ఆస్పత్రికి వచ్చారు. కొందరు కల్తీ కల్లు తాగి ఆగమయ్యారు.  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతటా మందుబాబుల పరిస్థితి ఇదేరకంగా ఉంది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతటా మందుబాబుల పరిస్థితి ఇదేరకంగా తయారైంది. మందుకు బానిసలైన వారి పరిస్థితిని అర్థం చేసుకున్న మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మారీ.. రాష్ట్ర సీఎంకు తాజాగా ఓ లేఖ రాశారు. వైన్ షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం కొన్రాడ్ కే. సంగ్మాను శుక్రవారం లేఖ లో అభ్యర్థించారు.

మద్యపానం రాష్ట్రంలో జీవన విధానంగా ఉందని.. కాబట్టి వైన్ షాపులు తెరవడానికి పర్మిషన్ ఇవ్వాలని మేఘాలయ సీఎంను బీజేపీ రాష్ట్ర చీఫ్ కోరారు. నిత్యావసర వస్తువులతోపాటు కేటాయించిన సమయంలో వైన్ షాపులు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ ఆ రాష్ట్ర వైన్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ కూడా.. అందుకే ఇలా లేఖ రాశారా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



Tags:    

Similar News