వాట్సాప్ రెండు గంటల పాటు పనిచేయకపోవడంతో అంతా ఆగమాగమైంది. వినియోగదారులు ఏం జరుగుతుందో అర్థం కాక ట్విట్టర్ లోకి వెళ్లారు. అక్కడ వాట్సాప్ పనిచేయడం లేదని సృజనాత్మకంగా మీమ్స్ తయారు చేసి సెటైర్లు వేశారు. చాలా మంది నెటిజన్ల మీమ్స్ తో ట్విట్టర్ లో ‘వాట్సాప్ డౌన్’ ట్రెండింగ్ గా మారింది. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
వాట్సాప్ కు గ్రహణం పట్టిందని..సాయంత్ర గ్రహణం వీడే దాకా రాదని ఫన్నీగా కొందరు కామెంట్ చేస్తున్నారు. వాట్సాప్ లేకపోతే మా పరిస్థితి ఏంటని మరికొందరు అంటున్నారు.
వాట్సాప్ డౌన్ తో అది పనిచేయకపోవడంతో అంతా ట్విట్టర్ లోకి పరుగులు తీస్తున్నట్టున్న మీమ్స్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇక వాట్సాప్ దుకాణం బంద్ అయ్యిందని.. ట్విట్టర్ కు వెళుతున్న వినియోగదారుల కార్టూన్లు రూపొందించారు.
ఇక వాట్సాప్ బంద్ అయ్యిందని గుండెల మీద చేయి వేసుకొని హమ్మయ్య అంటూ హీరోల మీమ్స్ తో ట్వీట్స్ చేశారు. వాట్సాప్ బంద్ కావడంతో అంతా ట్విట్టర్ లోకి వెళ్లిపోతున్నారని పరుగులు తీస్తున్న జనాల వీడియోలను షేర్ చేసి ఎండగట్టారు.
వాట్సాప్ పనిచేయక జనాలు అంతా అపార్ట్ మెంట్ల నుంచి బయటకొచ్చి చూస్తున్న ఫొటోను కొందరు మీమ్ గా క్రియేట్ చేశారు. నా ఒక్కడిదే పనిచేయడం లేదా? అందరిదా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నట్టున్నట్టు ఫొటో మీమ్ బాగా పేలింది.
వాట్సాప్ ఆగిపోవడంపై సోషల్ మీడియా యూజర్లు ఒక్కసారిగా ట్రోలింగ్ ప్రారంభించారు. మొదటగా అందరూ తమ నెట్ ఉందో లేదో చెక్ చేసుకొని ఉంటారని.. వైఫై ఎందుకు పోయిందో అని ప్రొవైడన్ ను నిందించాక.. వాట్సాప్ దే తప్పు అని తెలుసుకుంటారంటూ పెట్టిన మీమ్ నవ్వులు పూయిస్తోంది.
ఇక హమ్మయ్య వాట్సాప్ పనిచేయడం లేదని రోనాల్డో ఫుట్ బాల్ ప్లేయర్లు గుండెల మీద చేయి వేసుకొని హాయిగా కళ్లు మూసిన మీమ్ నవ్వులు పూయిస్తోంది.
వాట్సాప్ పనిచేయకపోవడంతో దాని అధినేత మార్క్ జుకర్ బర్గ్ సహా ఇంజినీర్లు వైర్లను అన్నీ రిపేర్లు చేస్తున్న ఫొటోను కొందరు మీమ్ గా క్రియేటర్ చేసి కామెడీ పంచారు.
Full View Full View Full View

WhatsApp down
Everybody coming to Twitter to check if it's happening to everyone