ఇప్పుడు తిండి తినకుండానైనా ఉండొచ్చేమో కానీ.. సోషల్ మీడియా లేకుండా క్షణమైనా ఉండలేని పరిస్థితి.. లైకులు, షేరింగ్ లు, పోస్టుల వెంట నేటి యువత పడిపోయారు. ఎన్ని లైక్స్ వస్తే అంత క్రేజ్. ఎన్ని కామెంట్స్ వస్తే అంత బజ్. రాకపోతే డిప్రెషన్. రోజూ తమ గురించి సోషల్ మీడియాలో పంచుకోవాలి.. వాటికి రెస్పాన్స్ కోసం పిచ్చివాళ్లలా ఎదురుచూసేవారు ఎందరో.. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా జనానికి పిచ్చెక్కిస్తోంది. పిచ్చిపట్టేలా చేస్తోంది. దానికి బానిసలా మారిన వారు ఎందరో ఉన్నారు.
సోషల్ మీడియా మాధ్యమాల వల్ల ఇతరులతో పోలికలు సమాజంలో ఎక్కువైపోయాయి. వారు మనకంటే బాగా బతుకుతున్నారని స్థోమత లేకున్నా ఖరీదైన వాటికోసం యువత వెంపర్లాడి ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకుంటున్న వారు ఉన్నారు. మనకంటే బాగా బతికేవారిని అనుసరించాలన్న తొందరలా తహతుకు మించి అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు. అసూయ, ద్వేషాలు పెరిగిపోయి విధ్వంసకారులు, దొంగలుగా కూడా మారిపోతున్నా వారు ఉన్నారు. నెగెటివ్ ఆలోచన మీ ఆత్మగౌరవాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోందని.. ఆందోళనకు కారణమవుతోందని తేలింది.
తరచుగా సోషల్ మీడియా సైట్లు వాడే వారిలో దానికి బానిసగా మారిపోయి ఒంటరితనం ఆవహిస్తుందని పరిశోధనలో తేలింది. నిరాశ, ఆందోళన, మానవ సంబంధాలపై ప్రభావం చూపుతుందని తేలింది. సోషల్ మీడియాకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సొంత వారిని పట్టించుకోరని తద్వారా బంధాలు దూరమై మానసిక రుగ్మతలు పెరిగిపోతాయని తేలింది.
సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవారు టార్గెట్ గా మారుతున్నారు. తమ గుట్టుమట్లు అన్నీ అందులో తేటతెల్లం కావడంతో వారు బెదిరింపులకు గురికావడం.. లేదా మానసిక హింసకు గురికావడం వంటివి ఈ మధ్య పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నారు.
* సోషల్ మీడియా నుంచి నివారణ మార్గాలివీ
సోషల్ మీడియాకు బానిస కావద్దంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఆన్ లైన్ లో ఎక్కువ సేపు గడపకపోవడమే మంచిది. సోషల్ మీడియాలో ఎంత సమయం వేస్ట్ చూస్తున్నామో తెలిపే యాప్స్ కూడా వచ్చాయి. వాటిని పెట్టుకొని దూరంగా ఉంటూ ఇంటి పనుల్లో పాలుపంచుకొని సేదతీరండి. ఇక అన్నింటికంటే చేయాల్సినది సోషల్ మీడియాలో నోటిఫికేషన్లను రాకుండా డిజెబుల్ చేస్తే అంతకంటే మంచిది మరొకటి ఉండదు. ఏ నోటిఫికేషన్ రాకపోతే ఏం కంగారు, ఆందోళన, ఉత్సుకత ఉండదు. తీరిపారా మనకు సమయం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. తరచూ చెక్ చేసుకునే అలవాటు నివారించవచ్చు.
ఇక సోషల్ మీడియాకు బానిస కావద్దంటే ముందుగా మీ స్నేహితులు, కుటుంబ సభబ్యులతో ఎక్కువ సమయం గడపడం. కుటుంబం, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడితే ఒత్తిడి దూరమవుతుంది. ఇక ప్రతి సంఘటనను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం మానేస్తే బెటర్. సోషల్ మీడియాను కేవలం మీ నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తే అంతకంటే మంచిపని మరొకటి కాదు..
సో ఈ పద్ధతులు పాటించి సోషల్ మీడియా మహమ్మారికి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ టైంను, విలువైన పనులను నెరవేర్చుకోండి.